Ads
- చిత్రం : మంగళవారం
- నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై.
- నిర్మాత : స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
- దర్శకత్వం : అజయ్ భూపతి
- సంగీతం : బి అజనీష్ లోక్‌నాథ్
- విడుదల తేదీ : నవంబర్ 17, 2023
స్టోరీ :
గోదావరి జిల్లాలోని మహాలక్ష్మి పురం అనే ఊరిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలు ప్రతీ మంగళవారం మరణిస్తుంటారు. దీంతో ఆ ఊరి ప్రజలను భయబ్రాంతులక గురి చేస్తుంది. రవి, శైలజ (పాయల్) చిన్నప్పటినుండి స్నేహితులు. ఒక ప్రమాదంలో రవి చనిపోయాడు అనుకుని శైలజ బాధపడుతుంది. అమ్మవారి జాతర జరిపించకపోవడం వల్లనే ఈ అరిష్టానికి కారణం అని గ్రామస్తులు భావిస్తారు. అలాంటి సమయంలోనే ఓ మహిళ దెయ్యమే అందరినీ చంపేస్తుందనే మూఢనమ్మకంతో ఉంటారు. ఆ ఊరికి మాయ (నందిత శ్వేత) అనే ఎస్ఐ కొత్తగా వస్తుంది. ఊరి ప్రజలు అందరూ కూడా ఆమె మీద అనుమానం పడతారు.
వీరిపై మాత్రమే కాకుండా ఆ ఊరి పెద్ద జమీందారు అయిన ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ), అదే ఊరిలో ఉండే గురజ (శ్రీ తేజ్), వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు (అజయ్ ఘోష్), వీరందరూ మాత్రమే కాకుండా అదే ఊరిలో ఉండే ఆర్ఎంపి విశ్వనాథం (రవీంద్ర విజయ్) మీద కూడా అనుమానాలు వస్తాయి.ఆ గ్రామంలో శైలు (పాయల్ రాజ్ పుత్)ను జమీందార్ ఆదేశాల మేరకు గ్రామస్తులు శిక్షించాలనుకుంటారు. శైలుకు ఎవ్వరూ అండగా నిలుస్తారు? చివరికి ఆ గ్రామంలో జరిగేవి హ*త్యలా..? ఆత్మహ**త్యలా..? మంగళవారం రోజే మరణాలు ఎందుకు సంభవించాయి ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
Ads
ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దర్శకుడు అజయ్ భూపతి ఇదే కాన్సెప్ట్ ని ఇప్పుడు ప్లస్ చేసుకున్నారు. శైలు అనే అమ్మాయి బాల్యానికి సంబంధించిన సంఘటనలతో కథను భావోద్వేగంతో ప్రారంభించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మా లక్ష్మీపురం గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను ప్రధానంగా చేసుకొని హీరో, హీరోయిన్లు లేకుండానే ఫస్టాప్ వరకు కథను పరుగులు పెట్టించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమే.
శైలు పాత్రకు సంబంధించిన చిన్న ట్విస్ట్ తో ఫస్టాప్ ను ముగించడంతో పాటు సెకండాఫ్ పై సినిమా సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ఉంటారు ఆడియన్స్. ట్విస్టులు మాత్రమే కాకుండా హీరోయిన్ క్యారెక్టర్ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు డైరెక్టర్. ఈ సినిమాకి పాయల్ రాజ్ ఫుట్ నటన చాలా హైలైట్. మిగిలిన అందరూ నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. సినిమాకి అతి పెద్ద హైలైట్ విజువల్స్. శివేంద్ర దాశరధి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. కాకపోతే సినిమా అక్కడక్కడా స్లో గా అన్పిస్తుంది. అది ఇంకొంచెం బాగా తీయొచ్చు అనుకుంట.
ప్లస్ పాయింట్స్ :
- డైరెక్షన్
- పాయల్ రాజ్‌పుత్
- విజువల్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- క్లైమాక్స్ ట్విస్ట్
- ఇంటర్వెల్ సీన్
మైనస్ పాయింట్స్:
- ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు రావడం
- అక్కడక్కడా స్లో సన్నివేశాలు
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.