Ads
అంతకుముందు పాపులారిటీ రావాలి అంటే ఎక్కువగా మార్గాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్లే పాపులర్ అయిపోతున్నారు. వారిలో కొంత మంది కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇటీవల చాలామంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అవ్వడమే కాకుండా, టీవీ షోస్ వరకు కూడా వెళ్లారు.
ఇప్పుడు సెలబ్రిటీలు కూడా అయిపోయారు. ఎన్నో షోస్ కి అతిధులుగా వీరిని పిలుస్తున్నారు. సినిమాల్లో కొన్ని కేమియో రోల్స్ కూడా ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కొంత మంది సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 కుమారి ఆంటీ
హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నడుపుకునే ఈ ఆంటీ, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం ప్రోగ్రాంలో కూడా కుమారి ఆంటీని పిలిచారు.
#2 బర్రెలక్క
ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసి కాస్త ఎక్కువ మొత్తంలోనే ఓట్లను సాధించారు బర్రెలక్క శిరీష. తర్వాత ఎంపీగా కూడా పోటీ చేస్తాను అని బర్రెలక్క ఇటీవల ప్రకటించారు.
#3 గంగవ్వ
మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేసేవారు గంగవ్వ. ఆ తర్వాత బిగ్ బాస్ ప్రోగ్రాంకి వెళ్ళారు. అక్కడి నుండి వచ్చేశాక ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.
Ads
#4 పల్లవి ప్రశాంత్
టిక్ టాక్ లో వీడియోలు చేసి, ఆ తర్వాత తనని తాను రైతుబిడ్డ అని చెప్పుకుంటూ, తనని బిగ్ బాస్ కి పంపియ్యాలి అని కోరిన పల్లవి ప్రశాంత్ రీల్స్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాయి. ఈ గుర్తింపు అతడిని బిగ్ బాస్ వరకు తీసుకువెళ్లి విజేతని కూడా చేసింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు.
#5 కుర్చీ తాత
ఎక్కడో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ కుర్చీని మడత పెట్టి అని ఒక పదం వాడితే, దాన్ని డీజే మిక్స్ చేసి ఒక వీడియో విడుదల చేస్తే, అది గుంటూరు కారం టీం వరకు వెళ్లడం, వాళ్లు ఆ పదాన్ని వాడి ఒక పాట చేయడం, ఆ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించడం, ఇదంతా జరగడంతో అసలు ఆ పదాన్ని వాడిన కుర్చీ తాత కూడా ఫేమస్ అయిపోయారు.
ప్రస్తుతం వీరు మాత్రమే ఫేమస్ అయ్యారు. భవిష్యత్తులో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఇలాంటి చాలా మంది సెలబ్రిటీలు వస్తారు.
ALSO READ : “దిల్ రాజు” లాగే “తమిళ్” లో సినిమా చేసి… హిట్ అందుకున్న తెలుగు నిర్మాతలు వీరే.!