Ads
జార్ఖండ్‌లోని గొడ్డాలో ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. టింకూ ఓ డెలివరీ బాయ్. రూ.2.5 లక్షలు అప్పు తీసుకుని తన భార్యకు నర్సింగ్ కోర్సు చదివించాడు. అయితే భార్య అతనికి ద్రోహం చేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. అంతే కాదు ప్రియుడిని పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను టింకూ కి షేర్ చేసింది. ఈ విషయమై టింకూ యాదవ్ తన భార్య, ఆమె ప్రేమికుడిపై సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇక పూర్తి వివరాల లోకి వెళ్తే…గొడ్డ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథౌన్ గ్రామానికి చెందిన బాధితుడు టింకు యాదవ్. అతని భార్య పేరు ప్రియా కుమారి. పెళ్లయ్యాక భార్య మరింత చదవాలనుకుంది… ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ, ఇద్దరి భవిష్యత్తు బాగుంటుందని భావించి టింకూ తన భార్యను చదివించడానికి ఒప్పుకొని భార్యను శకుంతల నర్సింగ్ స్కూల్లో నర్సింగ్ కోర్సులో జాయిన్ చేసాడు.
Ads
సుమారు రూ.2.5 లక్షల అప్పు తీసుకుని ఫీజు కట్టి చదివించాడు. పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత టింకూ భార్య చదువుకుంటున్న సమయంలో పొరుగువాడైన దిల్ఖుష్ రౌత్ ప్రేమలో చిక్కుకుంది. కోర్స్ పూర్తి అవ్వగానే అతనితో వెళ్ళిపోయింది ప్రియా. టింకూ కి ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది.
అప్పు తీసుకుని తన భార్యను నర్సింగ్ కాలేజీలో చేర్పించి ఏఎన్ఎం పట్టా ఇప్పించానని టింకు కుమార్ పోలీసులకు చెప్పాడు. రాత్రి పగలు కష్టపడి కాలేజీ ఫీజు కట్టానని చెప్పాడు . తర్వాత ఊహించని విధంగా.. సెప్టెంబర్ 17న కాలేజీకి సెలవుల తర్వాత తన భార్య ప్రియా కుమారి తన ప్రేమికుడితో కలిసి ఢిల్లీకి పారిపోయిందని, అక్కడ కోర్టులో పెళ్లి చేసుకుని పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని టింకూ చెప్పాడు. ఎంతో బాధపడ్డాను అన్నాడు. న్యాయం చేయమని కోరాడు. టింకూకు న్యాయం జరుగుతుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. ఈ విషయంపై నెటిజెన్స్ కూడా టింకూ కి న్యాయం జరగాలి అని కామెంట్స్ చేస్తున్నారు.