“ఇంత షూటింగ్ చేసాక ఎందుకు తీసేసారు గురూజీ?”… ఈ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ముఖ్యంగా 2 వ ది.!

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అతడు, ఖలేజా వంటి క్లాసిక్ సినిమాలు తర్వాత ఆ కాంబో నుంచి వస్తున్న సినిమా కావటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా జనాల అంచనాలను అందుకోలేకపోయింది. డైరెక్టర్ త్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

త్రివిక్రమ్ ఘోరంగా తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇదంతా సినిమా రిలీజ్ అయిన వారం పది రోజుల్లో జరిగిపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ ని ట్రోల్స్ కి గురి చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయిపోయిన పెళ్ళికి బాజాలు అన్నట్లు తలుచుకుని తలుచుకుని మరి బాధపడిపోతున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాంటి వాళ్ళ కళ్ళకి అప్పుడెప్పుడో షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలు ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఇందులో మహేష్, శ్రీలీల తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫోటోలు బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్ము పాత్ర పూజ చేయాల్సింది, మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాల్సింది అంటూ తెగ బాధ పడిపోతున్నారు ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్. పూజ లుక్ బాగుంది కదా ఈమెని ఎందుకు హీరోయిన్ గా తీసేసారు అంటూ త్రివిక్రంపై సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.

ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఇందులో హీరోయిన్గా ముందు పూజ హెగ్డే ని అనుకున్నారు, మీనాక్షి పాత్రలో శ్రీలీలని అనుకున్నారు. ఆ విషయం మూవీ టీం అనౌన్స్ చేశారు కూడా. అయితే కొద్దిరోజుల తర్వాత పూజ సినిమా నుంచి తప్పుకుందో, మూవీ టీం పూజని తప్పించిందో తెలియదుకానీ పూజా క్యారెక్టర్ సినిమాలో లేకుండా పోయింది. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోని జనాలు లేటెస్ట్ గా అప్పట్లో వచ్చిన ఈ ఫోటోని చూసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.

Previous articleఎందుకు అంత్యక్రియలు చేసేటప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు…?
Next articleNARA LOKESH: తాడేపల్లిగూడెం సభలో కనిపించని లోకేష్.. అదే కారణమా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.