Ads
బాలీవుడ్ హీరోయిన్, మోడల్ పూనమ్ పాండే 32 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆమె సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణ వార్త విని ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది.
నిన్న మొన్నటి దాకా చాలా యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే సడన్ గా మరణించడమేంటని ఆమె అభిమానులు, నెటిజెన్లు షాక్ కు గురవుతున్నారు. ఆమె మరణించిన వార్తను ఆమె టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమె మరణించడానికి ముందు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నటి మరియు మోడల్ పూనమ్ పాండే కొంతకాలం నుండి సర్వైకల్ క్యాన్సర్ తో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనమ్ టీమ్ శుక్రవారం నాడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈ పోస్ట్ చూడగానే అభిమానులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె టీమ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె నాలుగు రోజుల ముందు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో కూడా చాలా యాక్టివ్ గా కనిపించారు. అంత యాక్టివ్ గా కనిపించిన పూనమ్ 32 ఏళ్ళ వయసులో హఠాత్తుగా కన్నుమూయడం అందరినీ షాక్ గురి చేస్తోంది.
బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించిన పూనమ్ పాండే, మోడెల్ గా కూడా రాణించింది. సినిమాలతో కన్నా కాంట్రవర్సీలతో ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆమె చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. గతంలో వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
ఇక ఆమె చనిపోవడానికి 3 రోజుల ముందు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. పూనమ్ వైట్ కార్సెట్ టాప్, నలుపు రంగు ప్యాంట్‌లో అందంగా కనిపించింది. గోవాలో బీచ్ క్రూయిజ్ పార్టీకి పూనమ్ అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో పూనమ్ పాండేను చూసినవారికి సర్వైకల్ క్యాన్సర్ లాంటి వ్యాధితో బాధపడుతున్నారని కూడా ఊహించలేరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అయితే ఇవాళ పూనమ్ పాండే సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. తాను బతికే ఉన్నాను అని, అనారోగ్య సమస్య మీద అవగాహన కల్పించడానికి తాను ఇలా చేశాను అని చెప్పారు. అసలు నిన్న పూనమ్ పాండే మరణ వార్త వచ్చిన తర్వాత నుండి కూడా చాలా మంది ఆవిడ బతికే ఉన్నారు ఏమో అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు పూనమ్ పాండే స్వయంగా తానే అసలు తాను అలా చేయడానికి కారణం ఏంటి అని చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు.
Also Read: Miss Perfect Review: హీరోయిన్ “లావణ్య త్రిపాఠి”నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?