‘అరి’ మౌత్ టాక్ అదుర్స్.. దర్శకుడు జయశంకర్‌కు కేంద్ర మంత్రి అభినందన

Ads

 

నిన్న (అక్టోబర్ 10) విడుదలైన ‘అరి’ చిత్రానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ దర్శకుడు జయశంకర్ ఏడేళ్ల సుదీర్ఘ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా ఈ విజయాన్ని సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా మరియు ప్రేక్షకుల మౌత్ టాక్ అంతా పాజిటివ్‌గానే ఉండటంతో, ఈ వారం విడుదలైన సినిమాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది.

కిషన్ రెడ్డి ప్రశంస : “శ్రమ ఫలించింది”..
‘అరి’ చిత్రం సాధించిన విజయాన్ని గుర్తించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. ఏడేళ్ల పరిశోధన మరియు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఆయన కొనియాడారు. ఈ అభినందనలు చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Ads

‘అరి’ చిత్రంలోని లోతైన కథా, కథనం, మరియు సామాజిక సందేశం ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు దర్శకుడు జయశంకర్ ప్రేక్షకుడిని కథనంలో లీనం చేసిన విధానం అద్భుతమనే ప్రశంసలు దక్కుతున్నాయి. దీనితో దర్శకుడిగా ఆయన ద్వితీయ విఘ్నంను విజయవంతంగా దాటినట్టు అయ్యింది. అనూప్ రూబెన్ సంగీతం, ఆకట్టుకునే విజువల్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటుల పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం ‘అరి’ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ, ఒక మంచి సినిమాగా నిరూపించుకుంటోంది.

Previous articleఅరి రివ్యూ.. విలువల్ని చాటి చెప్పే చిత్రం