Ads
ప్రతి ఒక్క దానికి కూడా పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే మనం అనుసరిస్తూ ఉంటాము. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా మన సాంప్రదాయాన్ని మన పద్ధతులని మనం పాటిస్తూ ఉంటాము. అన్నప్రాసనికి, బారసాలకి, అక్షరాభ్యాసానికి, పెళ్లికి ఇలా ప్రతి దానికి ఎలా అయితే పద్ధతులు ఉన్నాయో… ఎలా అయితే పద్ధతుల్ని పాటిస్తున్నామొ… అలానే పద్ధతుల్ని అంత్యక్రియల విషయంలో కూడా పాటిస్తూ ఉండాలి.
మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దహన సంస్కారం ఏ విధంగా చేయాలి..?, ఎలా అనుసరించాలి అనే దాని వెనక ఆచారం ఉంటుంది.
Ads
దానికి తగ్గట్టుగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలని నిర్వహిస్తారు. అయితే ఎప్పుడైనా మీరు గమనించారా అంత్యక్రియల సమయంలో కుండని పగలగొడుతూ ఉంటారు. మొదట కుండా లో నీళ్లు పోసి ఆ కుండకి రెండు రంధ్రాలు పెట్టి దానిని శవం చుట్టూ పట్టుకుని తిరుగుతారు. ఆ కుండని పగలగొడతారు. అయితే ఎందుకు ఈ ఆచారం వచ్చింది..? సినిమాల్లో కూడా ఇలా చేయడాన్ని మీరు కూడా చాలా సార్లు చూసే ఉంటారు మరి అంత్యక్రియల సమయంలో ఎందుకు ఇలా అనుసరించాలి అనే దాని గురించి చూద్దాం.
మనిషి చనిపోయాక నేను బతికేవున్నాను అని స్నేహితులకి చెప్పడాన్ని మీరు చూసే వుంటారు. అలా లేపేదే ఆత్మ. అయితే మనిషి చనిపోయిన తర్వాత అంతక్రియలు అయ్యే దాకా ఆత్మ మనిషి లోపలకి వెళ్తుంది. మళ్ళీ లేవడానికి చూస్తుంది. కానీ మనిషి చనిపోయాడు కాబట్టి ఆత్మ చెప్తే శరీరం వినదు. ఆ కుండ మనిషిని సూచిస్తుంది. ఆ నీళ్లు ఆత్మ. ఎలాగైతే ఆత్మ మన నుండి బయటికి వెళ్తుందో అలాగే నీరు కూడా రంధ్రాల ద్వారా వచ్చేస్తుంది. ఆత్మకు శరీరం లేదని.. ఇప్పుడు కాల్చేస్తున్నామని ఆత్మను వెళ్ళిపొమ్మని ఇలా చేస్తారు.