Ads
సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కి కెరీర్ తక్కువ అనే విషయం తెలిసిందే. స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్స్ కూడా పదేళ్ల లోపే ముగుస్తుంది. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రమే రెండు లేదా మూడు దశాబ్దాలు పాటు కొనసాగుతుంటారు.
కొందరు హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలలో నటించి, కనుమరుగవుతారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించిన శ్వేత అగర్వాల్ తక్కువ కాలంలోనే సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. శ్వేత అగర్వాల్ ఎలా ఉందో? ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
దర్శకుడు రవిబాబు నరేష్ హీరోగా తెరకెక్కించిన అల్లరి సినిమా ద్వారా శ్వేత అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కన్నడ హీరో సుదీప్ నటించిన కిచ్చ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, విజయాన్ని అందుకుంది. కానీ ఆమెకు అక్కడ అంతగా ఆఫర్స్ రాలేదు. ఆ తరువాత మలయాళ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
2003 లో తెలుగులో ప్రభాస్ రెండవ సినిమా రాఘవేంద్రలో ఛాన్స్ పొందింది. ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ గా, ప్రభాస్ మరదలి పాత్రలో నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దాంతో శ్వేత అగర్వాల్ తెలుగులో అవకాశాలు రాలేదు. 5 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. 2008 లో ఒక విదేశీ చిత్రంలో, తెలుగులో గమ్యం సినిమాలో మందారం అనే పాత్రలో నటించింది. 2010 లో షాపిత్ అనే బాలీవుడ్ మూవీలో నటించింది. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది.
ఆమె కెరీర్ లో మొత్తం 7 సినిమాలలో నటించింది. షాపిత్ మూవీలో నటించిన సింగర్ ఆదిత్య నారాయణ్ ని ప్రేమించి, పెద్దల అంగీకారంతో 2020 లో పెళ్లి చేసుకుంది. ఆయనెవరో కాదు ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ కుమారుడు. శ్వేత అగర్వాల్ ఒక పాప. ఆమె ప్రస్తుతం బొద్దుగా, గుర్తు పట్టలేనంతగా మారింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజెన్లు గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పాయల్ రాజ్పుత్ “మంగళవారం” సినిమాని “చిరంజీవి” ప్రోమోట్ చేయడానికి కారణం ఇదా.?