ప్రభాస్ ”ప్రాజెక్ట్ కె” ఒక యుగాంతం క‌థ‌…!

Ads

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కూడా భారీగానే పెరిగింది. ఇంచుమించు ప్రతి ఒక్కరూ బాహుబలి సినిమాని చూసి ఫిదా అయిపోయారు. రాజమౌళి తీసుకువచ్చిన ఆ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలంటే ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటున్నాయి. కానీ ప్రభాస్ తర్వాత నటించిన రాధేశ్యామ్ పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నాడు.

ఇందులో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే నటిస్తోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మీద ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెట్టుకున్నారు.

ప్రభాస్ మంచి హిట్ కొడతాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కథ యుగాంతానికి సంబంధించినదని టాక్ నడుస్తోంది. 2012 అనే ఒక హాలీవుడ్ సినిమా అప్పుడెప్పుడో వచ్చింది. యుగాంతనికి సంబంధించిన కథ అది. ప్రపంచం అంతం అయిపోతుందా..? అప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాలు మీద సినిమాని తీసుకువచ్చారు. యుగాంతం గురించి కూడా మీడియాలో రకరకాల కథనాలు రావడం జరిగింది అయితే వాటి స్ఫూర్తితో ఆ కథని రాశారు.

Ads

తర్వాత యుగాంతం గురించి ఎవరూ సినిమా తీయలేదు. ప్రాజెక్ట్ కె కథ దీనికి సంబంధించిందని అంతా అన్నారు. ట్రావెల్ చుట్టూ వెళ్తున్నారు ఇది వరకైతే అన్నారు. కానీ కాదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కనుక ప్రభాస్ ప్రాజెక్టు కె సినిమా ట్రావెల్ సంబంధించినది కాదు అని తెలుస్తోంది. కానీ యుగాంతం గురించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు కె లో కె అంటే కల్కి. కల్కి అవతారంతో ప్రపంచం అంతమవుతుంది. ప్రభాస్ పాత్ర కల్కిని పోలి ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు. కానీ పురాణాలని తీసుకురాలేదు పాత్రలు మాత్రమే ఉంటాయి. అయితే పురాణాల కి సంబంధించిన టాపిక్ ఉండదని తెలుస్తోంది. డైరెక్ట్ గా పురాణాలని ఇందులో తీసుకురాలేదు కానీ పాత్రలు వాటి పేర్లు సందర్భాలు ఇవన్నీ కూడా పురాణాలకి సంబంధించినవి అని తెలుస్తోంది. మరి అసలు ఎలా నాగ్ అశ్విన్ సినిమా స్టోరీని తీసుకురాబోతున్నారు అనేది తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాలి.

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ప్రాజెక్ట్ కె’… ఓ యుగాంతం క‌థ‌!

Previous articleకేజిఎఫ్ మూవీలో ”గరుడ” గా నటించిన రామ్ కార్ డ్రైవర్ అని తెలుసా?
Next articleడబ్బులు చదివించేటప్పుడు ”116, 516,1116” ఇలానే ఎందుకు ఇస్తారు..? కారణం ఇదే..!