Ads
ప్రాజెక్ట్ K చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. దీనికి కారణం ఈ మూవీ గురించి తరచుగా కొత్త విషయాలు బయటకు రావడం. అయితే ఈ చిత్రం భారతీయ మూవీ గతిని మార్చేలా ఉంది.
Ads
ఈ సినిమా ఏకంగా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతొంది.ఈ చిత్ర డైరెక్టర్ వైవిధ్యమైన డైరెక్టర్ గా పేరు గాంచినప్పటికి, ఆయన గొప్పతనం ఇంకా పాన్ ఇండియా వైడ్ గా వెళ్లలేదు. కానీ ఆయనలో పాన్ ఇండియా రేంజ్ స్టఫ్ ఉందనేది మాత్రం పక్కా.
2018లో మహానటి చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత, చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా ‘ప్రాజెక్ట్ k’ అనే టైటిల్‌తో వస్తున్నారు. భాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఇపుడు ఈ సినిమా గురించి పాన్ ఇండియా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రోజుకో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. భారీ బడ్జెట్ తో ఏకంగా రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది.
ప్రభాస్, దీపిక పడుకొణె, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటీనటులతో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమా గురించి టైమ్ ట్రావెల్ నేపద్యం ఉంటుందని, సూపర్ హీరో నేపథ్యమని, స్టోరీ మన ఖండం మీద కాదని, భూ గ్రహమే కాదని ఇలా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిస్తోంది. ఈ సారి సినిమా స్టోరీ గురించి కాదు, మూవీ పేరు గురించి. ఇక ‘ప్రాజెక్ట్ K’లో K అనగా కల్కి అని చెబుతున్నారు.2012వ సంవత్సరంలో యుగాంతానికి సంబంధించినటువంటి వార్తలు వినిపించాయి. అలాగే సినిమాలు కూడా రూపొందాయి. కానీ ఆ తరవాత కాలంలో యుగాంతం కథను ఎవరు ముట్టుకోలేదు. ప్రాజెక్ట్ K సినిమా యుగాంతానికి సంబంధించిన స్టోరీ అని తాజాగా వార్తలు వస్తున్నాయి. కల్కి అవతారంతోనే కలియుగం అంతం జరుగుతుందని అంటుంటారు. అయితే ఈ చిత్రంలో కల్కి అంతం మరియు కలి యుగం ముగింపును చూపించబోతన్నారని అంటున్నారు. కాగా వీటి గురించి ఈ మూవీ టీమ్ నుండి ఎలాంటి స్పందన లేదు.
Also Read: ప్రాణస్నేహితుడు మరణించినా చివరి చూపుకు వెళ్ళని రజినీకాంత్.. ఎందుకో తెలుసా?