Ads
6 గ్యారంటీల పథకం అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం మొదలుపెట్టిన ప్రభుత్వం మిగిలిన నాలుగు గారెంటీ ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
అభయ హస్తం దరఖాస్తు పత్రాల తో పాటు లోగో ఆవిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్.. నిస్సహాయులకు, అభాగ్యులకు సాయం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు.
ప్రజా పాలన కార్యక్రమాలు రాష్ట్రమంతటా సవ్యంగా అమలు చేయడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలలో నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు జోన్లలో ప్రజాపాలనను సక్రమంగా అమలు చేయడం కోసం ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇక గ్యారంటీల పథకం కింద లబ్ధిదారుల కోసం దరఖాస్తులలో ఆరు గారంటీలకు సంబంధించిన కాలంలో ఉండే విధంగా చూసుకున్నారు.
Ads
ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఈ దరఖాస్తులు రూపొందించడం జరిగింది. ఆడవారికి హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకంలో ప్రతినెల మహిళలు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందుకోవడానికి ఇందులో ఒక కాలంని పొందుపరిచారు. ఈ పథకం వర్తిస్తుంది అనుకున్న వాళ్లు అక్కడ ఉన్న బాక్స్ లో టిక్ చేస్తే సరిపోతుంది.
హామీ ఇచ్చినట్టుగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందుబాటులో ఉండే ఆప్షన్ కూడా ఆ పత్రంలోనే ఇచ్చారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఆప్షన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. రైతు, కౌలు రైతు, పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు ,సాగు చేసే భూమి వివరాలు ,విస్తీర్ణం ఇలా చాలా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
వ్యవసాయ కూలీల కేటగిరీలో సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందాలి అనుకునే వారు వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఉపాధి హామీ కార్డు నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకునే వారు ఆ దరఖాస్తులు తగిన వివరాలను నమోదు చేయాలి. ప్రతి విషయానికి సంబంధించిన కాలం ను ఎంతో స్పష్టంగా మెన్షన్ చేయడంలోని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తమ పారదర్శకతను ,పాలించే విధానాన్ని స్పష్టంగా తెలియపరుస్తుంది.