వీళ్లిద్దరిలో తప్పు ఎవరిది..? అమర్‌దీప్ ఎందుకు అలా ప్రవర్తించారు..?

Ads

ఎప్పుడు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు అని నెగటివ్ ఫీలింగ్ తో నిండి ఉన్న అమర్‌దీప్ ని ఓదార్చడానికి బిగ్ బాస్ ,నాగార్జున సైతం.. అతనికి కెప్టెన్ గా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చారు.

అయితే దాన్ని సద్వినియోగపరచుకోవడం చేతకాక కొందరికి పనులు చెబుతూ ..కొందరికి పనులు చెప్పకుండా.. ఇంటి సభ్యులే అమర్‌దీప్ కెప్టెన్సీ పై అసహనం వ్యక్తం చేసే విధంగా ఉంది అతని ప్రవర్తన. అమర్‌దీప్ చేతికి కెప్టెన్సీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులు కూడా గందరగోళంగా తయారయ్యాయి.

prashanth amardeep issue bigg boss telugu 7

నామినేషన్ల సమయంలో కూడా కెప్టెన్ నేను చెబుతున్నాను కూర్చో అని అమర్‌దీప్ చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు. ఇంట్లో కూడా వరుసగా కొట్లాటలు గొడవలు జరగడం కామన్ అయిపోయింది. ఇంతకుముందు ఎపిసోడ్స్ లో ఎంతో సరదాగా ఉండే కెప్టెన్ అయిన తర్వాత చాలా డిస్టర్బ్ గా కంట్రోల్ తప్పి కనిపిస్తున్నాడు. అతని బిహేవియర్ వల్ల ఆ స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు ?ఎందుకు గొడవ పడుతున్నాడు? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అమర్‌దీప్ ఉన్నట్లు ప్రేక్షకులకు అర్థమవుతుంది.

Ads

prashanth amardeep issue bigg boss telugu 7

నిన్నటి వరకు విన్నర్ రేస్ లో ముందంజలో ఉన్న అతను తన బిహేవియర్ కారణంగా ఒక్క ఎపిసోడ్ తో పాతాళానికి పడిపోయినట్లు అయిపోయాడు. మరి ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో అతను ప్రశాంత్ పై విరుచుకుపడ్డాడు. మాటలతో బాధపెట్టింది చాలదని పంటితో కొరికి హింసించాడు. మరోపక్క ప్రశాంత్ కూడా వస్తున్న కోపాన్ని అంచిపెట్టుకొని కెమెరా ముందు బాగానే నటించడానికి ప్రయత్నించాడు. అమర్‌దీప్ ప్రవర్తన చూసిన కొందరు అతనికి నాగార్జున రెడ్ కార్డు ఇవ్వాలి అని.. ఎలిమినేట్ చేయాలి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో బిగ్ బాస్ హౌస్ ఉంది.

ALSO READ : అవికా గోర్ “వధువు” వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Previous articleఅసలు ఎవరు ఈ శ్రీధర్ బాబు..? తెలంగాణ కొత్త IT మినిస్టర్ రాజకీయ ప్రస్థానం ఇదే..!
Next article“హయ్ నాన్న” సినిమాలో హీరో కంటే ఇతనే హైలైట్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.