Ads
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్ వర్మ వైపే చూస్తుంది. హనుమాన్ మూవీ సినిమా తీయటానికి ముందు ప్రశాంత్ వర్మ మంచి డైరెక్టర్ అని టాలీవుడ్ వరకు మాత్రమే తెలుసు. హనుమాన్ సినిమా పాన్ ఇండియా మూవీ కావటంతో అతని ప్రతిభ బాలీవుడ్ కి కూడా పాకింది. హనుమాన్ సినిమా విడుదలై ఇప్పటికీ 18 రోజులు పూర్తయినప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే 250 కోట్ల వసూలు రాబట్టిన ఈ సినిమా త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో చేరనుంది.
అయితే ఈ సినిమా హిట్ అవ్వటానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలెంట్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ ఒక ఎత్తు అన్నట్లు హనుమాన్ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకొక సీన్ కూడా యాడ్ చేయాలనుకున్నాడంట ప్రశాంత్ వర్మ. విభీషణుడి మాటలతో యోగనిద్ర నుంచి మేల్కొన్న ఆంజనేయస్వామి వాయువేగంతో అంజనాద్రిని చేరుకుంటాడు. ఆ ప్రయాణంలో చాలా పుణ్యక్షేత్రాలను చూపించాడు ప్రశాంత్ వర్మ. వారణాసిలో ఒక ముని ధ్యానం చేస్తుండటం..
Ads
హనుమాన్ వాయువేగంతో ఆకాశం మీద నుంచి వెళ్లడంతో ఆముని కళ్ళు తెరవడం, పులులు భయపడుతున్నట్లుగా కనిపించడం ఇలా చాలా సీన్స్ ఉంటాయి. అయితే ప్రశాంత్ వర్మ ఈ సీన్స్ కన్నా ముందు ఇక్కడ వేరే సీన్స్ ప్లే చేయాలని అనుకున్నారంట. అయోధ్య రామ మందిరం బ్యాక్ డ్రాప్ గా ఆ సీను ఉండాలని ఒక సీను కూడా రాసుకున్నారట. అయోధ్య రామ మందిరంలో ఒక పాప దీపాలను వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ వెలిగించలేకపోతుంది.
ఆ సమయంలో హనుమాన్ రామ మందిరం పైనుంచి వెళ్ళడంతో ఒకసారిగా దీపాలు అన్ని వాటి అంతట అవే వెలుగుతాయి. ప్రశాంత్ వర్మ ఈ సీన్ అక్కడ పెట్టాలనుకున్నాడంట కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని చెప్పుకొచ్చాడు. అయితే ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు అంత మంచి సీన్ ఎందుకు మిస్ చేసావ్ అన్న ఆ సీన్ పడుంటే థియేటర్స్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగి మోగిపోయేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.