Ads
తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తారకరత్న గుండెపోటుతో హాస్పట ల్ లో చేరిన ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ 23 రోజుల తరువాత కన్నుమూశారు. చాలా భవిష్యత్ ఉన్న తారకరత్న ఎవరు ఊహించని విధంగా మరణించడం ఫ్యామిలీ, ఫ్యాన్స్ జీర్ణించుకోలే కపోతున్నారు.
Ads
అయితే తారకరత్న మరణం అనంతరం ఆయన ఆర్థిక స్థితి గురించి చాలా వార్తలు వినిపించాయి. ఆయన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని, ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల తారకరత్న చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని వినిపించాయి. అంతేకాకుండా ఆయన ఇబ్బంది పడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు ప్రతి నెలా 4 లక్షల పంపించే వారనే వార్త నెట్టింట్లో వైరల్ గా మారడం తెలిసిందే. అయితే తారకరత్న సన్నిహితులు, నిర్మాత ప్రసన్న కుమార్ తాజాగా ఒక మీడియాతో ఈ వార్తల గురించి మాట్లాడారు.
తారకరత్న ఆర్థిక స్థితి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆయన చనిపోయే ముందు కూడా కంటిన్యూగా మూవీస్ చేస్తున్నారని, పారితోషికం కూడా వస్తోందని తెలిపారు. అయితే తారకరత్నకు లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలనే కోరిక. అది తప్పా, ఆయన జీవితంలో ఏరోజూ ఆర్ధిక ఇబ్బందులు చూడలేదని ఆయన తెలిపారు. ఇక తారకరత్న వివాహ సమయంలోనే తారకరత్నకు ఇంట్లో వాళ్ళు లెక్క ప్రకారం ఇచ్చారని వెల్లడించారు.
అయితే ఇక నుండి తారకరత్న రాజకీయ జీవితం , సిని కెరీర్ మలుపు తిరుగుతుందని అనుకున్నామని ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ లోపే తారకరత్న కన్నుమూయడం చాలా బాధను కలిగించిందని అన్నారు. తారకరత్న ఇక లేరని వార్తతో సినీ లోకం అంతా కన్నీళ్లు పెట్టుకుంది. భర్త దూరమయ్యాడని అలేఖ్య రెడ్డి ఎంతగానో విలపించింది. యువగళం పాదయాత్రలో పాల్గొన్నఆయనకు కుప్పంలో గుండెపోటు రావడంతో వెంటనే దగ్గరలోని హాస్పటల్ కి తరలించి, అక్కడ నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడే చికిత్స కొనసాగింది. కానీ చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లారు తారకరత్న.
Also Read: పవన్ కళ్యాణ్, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?