పుష్ప కేశవ అలియాస్ నటుడు “జగదీష్” ని ఎందుకు అరెస్ట్ చేశారు..? అసలు విషయం ఏంటంటే..?

Ads

అల్లు అర్జున్ ని నేషనల్ స్టార్ చేసిన సినిమా పుష్ప. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అల్లు అర్జున్ కి మాత్రమే కాదు. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ కూడా చాలా బాగా గుర్తింపు వచ్చింది.

దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి కూడా పాపులారిటీ ఇంకా పెరిగిపోయింది. అయితే సినిమాలో పుష్ప పక్కనే ఉంటూ దాదాపు సినిమా మొత్తం కనిపించే పాత్ర కేశవ. కేశవ పాత్ర పోషించిన నటుడి పేరు జగదీష్ బండారి.

pushpa keshava incident real life

జగదీష్ కి కూడా చాలా గుర్తింపు వచ్చింది. అయితే జగదీష్ కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. జగదీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీవీ కథనం ప్రకారం జగదీష్ కెరీర్ ప్రారంభించిన తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ సమయంలో జగదీష్ కి ఒక యువతి పరిచయం అయ్యారు. ఆ తర్వాత జగదీష్ కి పుష్ప సినిమాలో అవకాశం వచ్చింది.

pushpa keshava incident real life

Ads

దాంతో పేరు కూడా వచ్చింది. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఐదు రోజుల క్రితం ఆ యువతి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ యువతి చనిపోవడానికి కారణం జగదీష్ అని తన కూతురిని నమ్మించి మోసం చేసిన కారణంగా ఆ యువతి ఇలాంటి ఘటనకి పాల్పడ్డారు అని ఆ యువతి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

pushpa keshava incident real life

దీంతో జగదీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జీ తెలుగు న్యూస్ కథనం ప్రకారం ఆ యువతి మరొక వ్యక్తితో ఉన్న సమయంలో జగదీష్ ఆమెకి తెలియకుండా ఫోటోలని తీశారు అని, ఆ ఫోటోలను చూపించి ఆమెని బెదిరించారు అని ఈ కారణంగానే ఆ యువతి ఇలాంటి పని చేశారు అని వార్త కూడా వచ్చింది. ఈ వార్త కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. జగదీష్ ని పంజాగుట్ట పోలీసులు బుధవారం కోర్టులో హాజరు పరిచారు.

ALSO READ : 10 ఏళ్ళ క్రితం వచ్చిన పాట… ఇప్పుడు సడన్ గా ఫేమస్ అయ్యింది..! కారణం ఏంటంటే..?

Previous article7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఓడించాడు..! ఈ సామాన్యుడు ఎవరో తెలుసా..?
Next articleఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి కట్టుకునే చీరలకు అంత ప్రత్యేకత ఉందా..? వాటి ధరలు ఎంతో తెలుసా?