Ads
ఇంట్లో ఉండే వాళ్ళు ఇంటి పెద్దలు చేసే పనులు… ఇంటి పెద్దలు అనుసరించే పద్ధతుల్ని చూసి అనుసరిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు. ఆచార్య చాణక్య ఎంతో గొప్ప పండితుడు. ఆయన రచయితగా సలహాదారునిగా ఎంతో పేరు ప్రఖ్యాతలని పొందారు. చాణక్య నీతి ద్వారా ఎన్నో ముఖ్యమైన అంశాలని మనకి పరిచయం చేసారు. మనిషి ఏ విధంగా ఉండాలి..?, జీవితంలో ఎటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కొంటూ ఉండాలి..? ఏ విధంగా నడుచుకోవాలి..? ఏది సరైన మార్గం వంటి విషయాలని కూడా చెప్పారు.
నిజానికి చాణక్య నీతి ద్వారా మనం ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. ఏ బాధ లేకుండా ఆనందంగా జీవించొచ్చు.
అయితే ఒక కుటుంబం ఎదగాలన్నా… ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా ఇంటి నాయకత్వం బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఇంటి యజమాని సరిగ్గా ఉంటారో ఆ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకోగలదని ఆచార చాణక్య అన్నారు. ఒకవేళ కనుక ఇంటి యజమాని సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం నాశనం అవుతుందని చాణక్య నీతి ద్వారా చాణక్య పేర్కొన్నారు. అయితే ఎటువంటి లక్షణాలు ఇంటి పెద్దలో ఉండటం వలన కుటుంబం నాశనం అవ్వకుండా బాగుపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
Ads
#1. ఆహారాన్ని అవమానించకూడదు:
ఇంటి యజమాని ఎప్పుడూ కూడా ఆహారాన్ని అవమానించకూడదు. ఆహారాన్ని అవమానిస్తే ఇంట్లో వుండే పిల్లలు కూడా అదే అనుసరిస్తారు. సో అలా చెయ్యకండి.
#2. చక్కటి సంబంధం:
మీ కుటుంబ సభ్యులతో మీరు మంచి సంబంధం కలిగి ఉంటే ఇతరులు కూడా అలానే నడుచుకుంటారు. కష్టనష్టాల్లో తోడై ఉండడం. ఆనందంగా ఉండడం ఇవన్నీ కూడా మంచి రిలేషన్ ఉంటేనే అవుతాయి.
#3. సమస్యని సాల్వ్ చేయడం:
ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే.. వాళ్ళతో మాట్లాడి దానిని సాల్వ్ చెయ్యాలి. ఒకవేళ కనుక ఇంటి యజమాని వారి సమస్యలను పట్టించుకోకుండా ఉంటే.. ఆ కుటుంబంలో అశాంతి మాత్రమే ఉంటుంది.
#4. డబ్బు వృధా చేయడం:
భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఇంటి పెద్ద ఆలోచించాలి. డబ్బు వృధా చేయకూడదు. పొదుపు చేస్తుండాలి.