Ads
పెళ్లి అనేది ఒక అందమైన బంధం అని అంటారు. కానీ అందులో కూడా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని వెళ్తేనే ఆ బంధం బలం అవుతుంది. ఇద్దరు కలిసి ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఒకళ్ళ ఆలోచనలు మరొకళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటేనే కలిసి ఉండగలుగుతారు.
అయితే, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ అలా ఎక్స్పెక్ట్ చేస్తే, అవతలి వారు అదే విధంగా ఉండడం కూడా ముఖ్యమైనదే. అలా, చాలా మంది భార్యలు తమ భర్తలకి ఈ 5 లక్షణాలు ఉండాలి అని కోరుకుంటారట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 ముందుగా తన భర్త తనని అర్థం చేసుకోవాలి అని ప్రతి భార్య అనుకుంటుంది. ఎక్కువగా అహంకారం చూపించకుండా, అర్థం చేసుకునే తత్వం ఉంటే బాగుంటుంది అని భార్యలు అనుకుంటారు.
#2 సర్ప్రైజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎంతో మంది భార్యలు కూడా, తమ భర్తలు తమని సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటారు. వారికి నచ్చినది ఏదైనా సరే తెలుసుకొని, తాము అడగకుండానే తమ భర్తలు ఆ నచ్చిన వాటిని తీసుకురావాలి అని చాలా మంది భార్యలు కోరుకుంటారు.
#3 నిజాయితీగా ఉండే భర్తలని భార్యలు ఇష్టపడతారు. తాము తప్పు చేసినా సరే, ధైర్యంగా వెళ్లి తమ భార్యలకి చెప్పాలి. ఒకవేళ మొదట తన భార్య ఆ విషయం వల్ల బాధపడినా కూడా తర్వాత అర్థం చేసుకొని అతనిలోని నిజాయితీని అంగీకరిస్తుంది. అబద్ధాలు చెప్పడం కంటే, నిజం చెప్పి నిజాయితీగా ఉన్న వారిని మాత్రమే భార్యలు ఇష్టపడతారు.
Ads
#4 మనిషి అన్నాక ఇష్టాలు ఉంటాయి. అన్ని ఇష్టాలు కూడా చెప్పలేరు. కాబట్టి తమకి ఏం ఇష్టం అనేది తమ భర్తలు అడగకుండానే తెలుసుకోవాలి అని చాలా మంది భార్యలు అనుకుంటారు. ఒకవేళ తెలుసుకున్నా కూడా తర్వాత మర్చిపోకుండా వాటిని గుర్తు పెట్టుకోవాలి అని భావిస్తారు. భార్యలు కూడా అలాగే తమ భర్త ఇష్టాలని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు.
#5 ప్రతి ఒక్కరికి ఒకే అభిప్రాయాలు ఉండవు. కలిసి ఉన్నా కూడా వేరు వేరు అభిప్రాయాలు ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు అవతల వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. భర్తలు తమ అభిప్రాయాలకు విలువని ఇవ్వాలి అని చాలా మంది భార్యలు అనుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం వరకు సరే. కానీ భర్తల అభిప్రాయాన్ని వారి మీద రుద్దొద్దు అని చాలామంది భార్యలు అనుకుంటారు.
చాలా మంది ఆడవారు తమ భర్తల నుండి ఎక్కువగా ఆశించే విషయాలు ఇవే. ఇలాంటి లక్షణాలు ఉండే భర్తలని కావాలి అనుకుంటారు.
ALSO READ : గృహిణులు చేసే ఈ ఒకే ఒక్క తప్పు వల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా..? అదేంటంటే..?