Ads
సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. తెలుగులో టాప్ స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించిన రాధిక అప్పట్లో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు కూడా క్యారెక్టర్లు చేస్తూ తెలుగువారికి దగ్గరగా ఉంటున్నారు.
ఎక్కువగా మదర్ క్యారెక్టర్లు చేస్తూ రాధిక నటనను కొనసాగిస్తున్నారు. నటుడు శరత్ కుమార్ రాధిక వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఆయన కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ బిజీగా ఉంటారు.
Ads
అయితే తాజాగా రాధిక శరత్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తమరు తాజాగా ఒక సినిమా చూశానని, ఆ సినిమా చూస్తున్నంత సేపు తనకి వాంతి వచ్చినంత పనైందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా చూశాక తనకు చాలా కోపం వచ్చిందని అన్నారు. అయితే ఇంతకీ ఆమె ఏ సినిమా చూశారు? ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారని విషయం స్పష్టం చేయలేదు. అయితే కామెంట్స్ లో మాత్రం చాలామంది రాధిక మాట్లాడుతుంది తాజాగా వచ్చిన రణబీర్ కపూర్ యానిమల్ సినిమా గురించి అని అంటున్నారు.
ఈ సినిమా ఇటీవల ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూసే రాధిక ఇటువంటి కామెంట్లు చేశారని మెజారిటీ ఆఫ్ కామెంట్లు ఉన్నాయి. యానిమల్ సినిమా చాలామందికి నచ్చలేదన్న విషయం తెలిసిందే. చాలా మంది బహిరంగంగానే వచ్చి ఈ సినిమా మీద కామెంట్లు చేశారు.రాధిక మాత్రం ఇన్ డైరెక్ట్ గా ఈ సినిమా మీద కామెంట్లు చేశారని చెబుతున్నారు