Ads
బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు వెళ్లకముందే సింగర్ గా రాహుల్ అందరికీ సుపరిచితమే. ఎక్కువగా ఫోక్ పాటలు పాడుతూ బాగా పాపులర్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ తో మరింతగా పాపులర్ అయ్యారు. ఆ తరువాతఆ నుండి వరుసగా చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఆస్కార్ పొందిన ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ పాడింది రాహులే. తాజాగా అతను బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ రతిక పై చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్‌బాస్ సీజన్ 7లో తొలి రోజే తన లుక్స్‌తో రతిక ఆకట్టుకుంది. దీంతో నెటిజన్స్ నెట్టింట్లో ఈ బ్యూటీ గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో క్లోజ్ గా ఉండి, నామినేషన్స్ లో మాత్రం వెన్నుపోటు పొడిచింది. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తో ఐ లైక్ యూ అని పాటలు కూడా పాడుకున్నారు. అయితే ఆమె హౌజ్ లోకి వెళ్ళిన తరువాత రతిక రాహుల్ సిప్లిగంజ్ గతంలో ప్రేమించుకున్నారని,ఆ తరువాత బ్రేకప్ అయినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళు గతంలో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దాంతో రతీక పై అందరి దృష్టి పడింది.
రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన మాజీ ప్రేయసి రతిక గురించి సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఆమె పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగా పోస్ట్ పెట్టాడు. అందులో ” నాకు ఒక ప్రశ్న ఉంది. 6 ఏళ్ల తర్వాత ఒకరి ఫోన్‍లోని పర్సనల్ ఫొటోలు హఠాత్తుగా బయటకు వచ్చి, ఇంటర్నెట్‍లో ఎలా షికారు చేస్తున్నాయి. ఇది వారు హౌజ్ లోపలకి వెళ్ళడానికి ముందే ప్రీ ప్లాన్‍గా చేసిందా? గాయ్స్, ఈ ప్రశ్నకు మీరంతా జవాబు కనుక్కుని, అసలు వాస్తవాలు ఏమిటో గ్రహించాలి.
Ads
తనకు, మరొకరి లైఫ్ తో ఎ విధమైన రిలేషన్ లేదు. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, అందరికీ కుటుంబం, స్నేహితులు ఉంటారు. వారి మీద ఇలాంటివి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. వాళ్లు ఇలాంటివి చేసే ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనిషి లైఫ్ లో పాస్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్రజంట్ ఉంటుంది. అందువల్ల ప్రతి విషయన్ని అవగాహన లేకుండా జడ్జ్ చేయకండి. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్లందరికి కృతజ్ఞతలు. ఎవరు నెగెటివిటీని స్ప్రెడ్ చేయాలని భావిస్తారో వారికి ఆల్ ద బెస్ట్” అంటూ రాహుల్ సిప్లిగంజ్ రాసుకొచ్చాడు.
Also Read: అవి తీసుకోవడం వల్లే “సమంత” ఫేస్ ఇలా అయిపొయింది అంట.?