Ads
ప్రేమ గురించి చాలా మంది ఇప్పటివరకు రకరకాల నిర్వచనాలు చెప్పారు. ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. కొందరి ప్రేమ సుఖాంతం కాగా, మరికొందరి ప్రేమ విషాదాంతంగా ముగుస్తాయి.
Ads
ఇక ప్రేమలో మునిగిపోయిన ఆ జంట ఎప్పుడు, ఏం చేస్తారో చెప్పడం కూడా చాలా కష్టమైన విషయమే. ప్రేమించిన వారు దగ్గర ఉన్నప్పుడు కొందరు తమ చుట్టూ ఉన్నవారినే మర్చిపోతుంటారు. ఇంకొంతమంది ఎవరికి తెలియకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. ఇలా ప్రేమలో పడిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రేమకథని ఇప్పుడు చూద్దాం.
అదొక రైల్వే స్టేషన్, ఆ ప్లాట్ ఫామ్ పై పిల్లర్ నైన్ దగ్గర ప్రతిరోజు ఒకవైపు అందమైన అమ్మాయి ఆ పిల్లర్ కు మరో వైపు ఒక అబ్బాయి కూర్చుని ట్రైన్ కోసం ఎదురు చూసేవారు. వారు ఎదురుచూస్తున్న ట్రైన్ రాగానే, ఎక్కి ఎవరి ఉద్యోగానికి వారు వెళ్లిపోయేవారు. మళ్లీ సాయంత్రానికి అదే స్టేషన్ కు వచ్చి వారి ట్రైన్ వచ్చేవరకు ఆ పిల్లర్ నైన్ దగ్గరే అమ్మాయి, అబ్బాయి కూర్చునేవారు.
ఇది ఇలాగే కొన్నిరోజులు కొనసాగింది. మెల్లగా ఇద్దరి మధ్య పరిచయం జరిగి, మాటలు పెరిగాయి.ఇది 2015లో జరిగినది. ఈ విషయన్ని ఆ అబ్బాయి చెప్తూ మా పరిచయం తరువాత ఆ అమ్మాయికి పిల్లర్ నెంబర్-9 అనే నిక్ నేమ్ పెట్టాను. ఆ తరువాత ఒక రోజు ఆ అమ్మాయితో కలిసి వాళ్ళింటికి వెళ్ళి వచ్చాను. న ప్రేమను కూడా ఆమెకు రైల్వే స్టేషన్ లోనే ప్రపోజ్ చేశానని, అప్పుడే తనతో మొదటిసారి సెల్ఫీ తీసుకున్నానని తెలిపాడు.
అక్కడ అలా మొదలైన లవ్ స్టోరీ ఆ తరువాత షికారులు, సినిమాలు,రెస్టారెంట్లు అంటూ లవ్ ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లింది. ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోవడంతో మా పెళ్లి జరిగినది. ప్రస్తుతం మాకు ఒక పాప అని చెప్పాడు. వారిద్దరు వివిధ సందర్భాలలో దిగిన ఫోటోల గురించి చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షికారు చేస్తున్నాయి.
Also Read: కేవలం ఒక్క డ్రెస్ తోనే పూర్తి చేసిన 8 సినిమాలు..