రాజ్ తరుణ్ పురుషోత్తముడు.. సినిమా ఎలా ఉందంటే?

Ads

సినిమా: పురుషోత్తముడు
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీశర్మ, ముకేశ్ ఖన్నా తదితరులు
దర్శకుడు: రామ్ భీమన
నిర్మా తలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్
విడుదల తేదీ: 26 జూలై, 2024

ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాజ్ తరుణ్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అలాంటి రాజ్ తరుణ్ కొత్త సినిమా పురుషోత్తముడు విడుదల అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…

కథ:
రామ్‌(రాజ్‌ తరుణ్‌) విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకి వస్తాడు. ఆయన ఫ్యామిలీకి హైదరాబాద్లో ఇండస్ట్రీస్‌ ఉంటాయి. ఆ కంపెనీకి సీఈవో ఎంపిక ఘట్టం జరుగుతుంది. రచిత్‌ రామ్ కి, తన పెదమ్మ (రమ్యకృష్ణ‌) కొడుకు మధ్య పోటీ నెలకొంటుంది. రామ్‌ విదేశాల్లో పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విషయాలు తెలియవు, అవగాహన లేదు, ఇంత పెద్ద పోస్ట్ కి అర్హుడు కాడనే ప్రతిపాధన వస్తుంది. సీఈవో కావాలంటే వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ మనిషిలా బతకాలని, ఈ టైమ్ లో ఎవరూ తనని గుర్తించకూడని, ఒకవేళ అలా ఎవరైనా గుర్తిస్తే సీఈవో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన రామ్‌ అన్నీ వదులుకుని తన ఇంటిని, కంపెనీ వదిలేసి వెళ్లిపోతాడు. వైజాగ్‌ ట్రైన్‌ ఎక్కి మధ్యలో ఓ మారుమూల గ్రామానికి చేరతాడు. అక్కడ అమ్ములు(హాసినీ సుధీర్‌) తనని మోటర్ సైకిల్ తో గుద్దుతుంది. దీంతో అపస్పారక స్థితిలో పడిపోయిన రామ్‌ని తన ఇంటికి తీసుకెళ్తుంది. తనకు ఎవరూ లేరని, అనాథని అని చెప్పి ఆమె వద్ద వ్యవసాయం పనులు చేసేందుకు పనిలో చేరతాడు రామ్‌. ఈక్రమంలో అమ్ములతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఈ ఊర్లో ఎక్కువగా పూలతోటల రైతులు ఉంటారు. మార్కెట్‌లో ఎమ్మెల్యే కొడుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంటాడు. ఎదురుతిరిగినవారిని అంతం చేస్తుంటాడు. దీంతో వాళ్ల తరఫున నిలబడతాడు రామ్‌. అందుకోసం పెద్ద స్థాయిలో పోరాటం చేపడతాడు. మరి ఆ పోరాటం ఏంటి? రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాడు? మరి వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఉండాలనే నిబంధనని పాటించాడా? బ్రేక్‌ చేశాడా? చివరికి సీఈవో ఎవరు అయ్యారు? ఇందులో ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ ఖన్నాల పాత్రేంటనేది మిగిలిన కథ.

Ads

సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. చివర్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.

సినిమా ఎలా ఉందంటే?
హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడపడం.. ఈ క్రమంలో అన్యాయానికి గుర‌వుతున్న‌ పేద ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోవడంతో వారికి సాయంగా నిల‌బ‌డ‌తాడు. ఇలాంటి పాయింట్స్‌తో ఇప్ప‌టికే కొన్ని సినిమాలు వ‌చ్చినా కూడా ఈ సినిమా క‌థ‌ను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు ద‌ర్శ‌కుడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాట‌లు ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు, ఫ్యామిలీతో క‌లిసి చూడ‌ద‌గిన సినిమా.

రేటింగ్: 3/5

Previous articleడాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ప్రారంభించిన ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్
Next article24 ఏళ్ళ వయసులో సీనియర్ ఎన్టీఆర్, జగ్గయ్య గారికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఇందులో ఏం రాశారు అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.