Ads
సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ప్రేమ కథ చాలామందికి తెలియదు. వీళ్ళిద్దరూ ఎంతలా ప్రేమించుకున్నారు..? ఆఖరికి సోనియా గాంధీ ఎంత బాధపడ్డారు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఎలా కలిశారో కూడా వీళ్ళకి తెలియదు. మొదటిసారి సోనియా గాంధీ రాజీవ్ గాంధీని చూసినప్పుడు ఆయనని అలా చూస్తూ ఉండిపోయారు సోనియా. అతను ఎవరని సోనియా తన ఫ్రెండ్ ని అడగగా తను ఇండియన్ అని పండిత్ నెహ్రూ గారి కుటుంబం అని చెప్పారు.
సోనియా అలానే రాజీవ్ ని చూస్తూ ఉండిపోయారు. ఆమె తర్వాత రోజు లంచ్ కి వెళ్ళినప్పుడు కూడా అతను అక్కడే ఉన్నారు. ఆ రోజుల్లో ఆమె ఎంతో ఆనందంగా ఉన్నారట.
కార్ లో కలిసి వెళ్లడం.. వీధుల్లో చేతులు చేతులు పట్టుకుని నడుస్తూ వెళ్లడం.. సినిమాలు చూడడం ఇలా ఎంతగానో వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారట. ఒకరి కోసం ఒకరు పుట్టామని వీళ్ళు ఎంతో ఆనందపడ్డారు. అందుకే కలిసి జీవించుదామని నిర్ణయం తీసుకున్నారు. ఇందిరా గాంధీ గారు అప్పుడు ప్రధాని. ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ ఇందిరా గాంధీ గారితో భయపడుతూనే ఉన్నారు. వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అనుమతి కావాలి అని అడిగారు.
Ads
ఇందిరా గాంధీ అప్పుడు రాజీవ్ ని ఇండియా రమ్మని చెప్పారు. సోనియా గాంధీ కి ఏమనిపించింది అంటే ఎక్కడ ఏ మూలలో రాజీవ్ తో వున్నా కూడా ఆనందంగా ఉంటానని ఆమె అనుకున్నారు. రాజీవ్ గాంధీ సోనియా ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తర్వాత రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో చనిపోయారు అప్పుడు ఇందిరా గాంధీకి మద్దతు అవసరం దీంతో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు కానీ సోనియాకి అది నచ్చలేదు. ఎలా అయినా సరే రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఆపాలని చూశారు కానీ కుదరలేదు, దేశం కోసం కష్టపడడం పేద ప్రజల అవసరాలు తీర్చడం వంటివి రాజీవ్ చేస్తున్నారు.
అంతా బాగుందనుకున్నప్పుడు ఓ రోజు ఇందిరా బయటికి వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినపడింది. ఇందిరా చనిపోయారు. తర్వాత రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు విడిచారు. ముక్కలైపోయిన శవం వచ్చింది. రాజీవ్ లేకుండా సోనియా కి చాలా కష్టం. ఎంతగానో రాజీవ్ ని ప్రేమించింది సోనియా. ప్రేమించిన వాళ్ళ శవాన్ని చూడడం నిజంగా బాధగా ఉంటుంది సోనియా కూడా అలానే ఎంతో బాధపడ్డారు. కానీ తర్వాత ఆమె మనసు రాయి అయిపోయింది. ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొన్నారు. విదేశీయుల బహుమతి, బార్ బర్, జెర్సీ ఆవు, వితంతువు అని ఇలా ఎన్నో మాటలు పడ్డారు సోనియా.