“రజినీకాంత్ లాంటి హీరో టీ అమ్మడం ఏంటి..?” అన్నారు..! అసలు విషయం ఏంటంటే..?

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ కి దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం వీరాభిమానులు ఉన్నారు. ఆయన నటనకు, స్టైల్ కు ప్రేక్షకులు  ఫిదా అయ్యారు.

అంతటి క్రేజ్, గుర్తింపు ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ రోడ్డు పక్కన టీ అమ్ముతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసినవారు కొత్త మూవీ షూటింగ్ అని భావించారు. కానీ అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రజనీకాంత్ రోడ్డు పక్కన కొట్టులో టీ అమ్ముతున్న వీడియో వైరల్ అవడంతో కొంతమంది ఇదేంటి రజినికాంత్ టీ అమ్మడం ఏంటని షాక్ అయ్యారు. కొంతమంది షూటింగ్ అని భావించారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే కేరళలోని కొచ్చిలో వెంకటేశ్వర హోటల్ లో టీలు అమ్ముతున్న ఆ హోటల్ ఓనర్ సుధాకర్ ప్రభుని చూడగానే అందరూ రజనీకాంత్‌ అనుకున్నారు. ప్రభు చిరునవ్వుతో కస్టమర్లకు టీలు అందిస్తున్న వీడియో అది.
ఈ వీడియో వైరల్ అవడంతో సుధాకర్ ప్రభు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. కొచ్చిన్‌లో షూటింగ్ చేస్తున్న ఒక మూవీ యూనిట్ టీ అమ్ముతున్న సుధాకర్ ప్రభును చూడగానే రజినీకాంత్ టీ అమ్మడం ఏంటని ఆశ్చర్యపోయారట. నాదిర్షా అనే మలయాళ డైరెక్టర్ సుధాకర్ ప్రభు వీడియో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక అతని వీడియోలు వైరల్ అవడంతో సుధాకర్ పాపులర్ అయ్యారు. కేరళలో జరిగే కార్యక్రమాలకు సుధాకర్ ఆహ్వానాలను  అందుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో డిస్పోటర్ అనే యూజర్ షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తి రజనీకాంత్ కాదనే విషయాన్ని కొంతమంది నమ్మలేకపోతున్నారు. సుధాకర్ ప్రభుకి రజినీకాంత్ కి ఉన్న పోలికను గుర్తించిన రజినీ అభిమానులు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.

Ads

Also Read: రాజేంద్రప్రసాద్, గౌతమి నటించిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

 

Previous articleకొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్ లో ఏ విషయాల గురించి వెతుకుతున్నారో తెలుసా?
Next article1986లో “రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350” ధర ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న అప్పటి బిల్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.