GAME CHANGER REVIEW: రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” తో సంక్రాంతికి హిట్ కొట్టగలిగారా.? కథ ఏంటి?

Ads

సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదలైన సినిమా “గేమ్ ఛేంజర్”. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా “రామ్ చరణ్” హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం.

చిత్రం : గేమ్ ఛేంజర్
నటీనటులు : రాంచరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు
నిర్మాత : దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం : శంకర్
కథ: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌ తిరుణ్ణావుక్క‌ర‌సు
డైలాగ్స్: సాయి మాధ‌వ్ బుర్రా
సంగీతం : ఎస్‌ ఎస్‌ త‌మ‌న్
విడుదల తేదీ : జనవరి 10, 2025

స్టోరీ :

రామ్ నందన్(రామ్ చరణ్)… IPS నుండి IAS ఆఫీసర్ గా మారతాడు. విశాఖ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుంటాడు. దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకి వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలోనే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య)తో గొడవ మొదలవుతుంది. ఇది ఇలా ఉండగానే… రామ్ కి దీపిక ఎదురుపడుతుంది. కాలేజీలో ఉన్నప్పుడు దీపిక(కియారా అద్వానీ) తో ప్రేమలో ఉంటాడు. ఆమె కోసమే IAS కూడా అవుతాడు. కానీ ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది.

మరోవైపు బొబ్బిలి మోపిదేవి తండ్రి అయిన ఏపీ సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)‌ అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు ఆదేశాలు ఇస్తారు. ఇది అతని కుమారులు అయిన బొబ్బిలి మోపిదేవి , రామచంద్రలకు ఏ మాత్రం నచ్చదు. ఒకప్పుడు సత్యమూర్తి…అప్పన్నకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని పాశ్చ్యాతాపం పడుతూ ఉంటాడు. అతని చివరి కోరిక వల్లే కథలో ట్విస్ట్ ఉంటుంది. దౌర్జన్యంగా సీఎం అవ్వాలన్న బొబ్బిలి మోపిదేవి ప్లాన్ ని అడ్డుకోవాలని అనుకుంటూ ఉంటాడు రామ్ నందన్.

రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న (రాంచరణ్), పార్వతి (అంజలి)కి ఎలా దూరం అయ్యాడు. మోపిదేవిని రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు. సత్యమూర్తి కొడుకుని కాదని రామ్ నందన్ ని సీఎం చేయాలని ఎందుకు అనుకున్నాడు. రామ్ నందన్ కి దీపికతో ఎందుకు బ్రేకప్ అయ్యింది.? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

Ads

ఇండియన్ 2 ఫ్లాప్ తర్వాత “శంకర్” దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ కి ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. కానీ అందులో కొత్తదనం ఏం కనిపించలేదు. అప్పన్న ఎపిసోడ్ లో తప్ప సినిమాలో శంకర్ మార్క్ అంతగా కనిపించలేదు. 90 స్ లో సోషల్ మీడియా లేనప్పుడు ఉన్న రాజకీయాలు లాగా నాటకీయంగా ఉంది ఈ సినిమా. రియాలిటీకి దూరంగా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ పొలిటికల్ డ్రామా లాగా ఉంటుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ మాస్ ఆడియన్స్ కి నచ్చేలాగా తెరకెక్కించారు. కానీ రామ్ నందన్, దీపిక ల లవ్ ట్రాక్ ని మాత్రం అంతగా తెరకెక్కించలేకపోయారు దర్శకుడు.

ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ మంచి హైప్ తో మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో పెంచిన అంచనాలకు తగ్గట్టుగానే అప్పన్న స్టోరీ సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. రామ్ నందన్, పార్వతి (తల్లి కొడుకులు) మధ్య సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో రొటీన్ మాస్ ఫైట్ తో ముగించారు శంకర్. అందుకే క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక నటన విషయానికొస్తే రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని, ఎస్.జె సూర్య తమ పాత్రలకు న్యాయం చేసారు. సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు.

ఈ సినిమాలో పాటలను అందంగా తెరకెక్కించారు. థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. గ్రాఫిక్ వర్క్ బాగుంది. మొత్తానికి దర్శకత్వంలో శంకర్ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అంతగా అంచనాలను అందుకోలేకపోయింది కానీ పరవాలేదు అనిపించింది.

ప్లస్ పాయింట్స్ :

  • అప్పన్న రోల్
  • ఇంటర్వెల్ ట్విస్ట్
  • థమన్ సంగీతం
  • సాంగ్స్ విసుఅల్స్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్ :“గేమ్ ఛేంజర్” గేమ్ ఇంకొంచెం బాగుంటే సినిమా ఇంకొంచెం బాగుండేది.

TRAILER:

 

Previous articleదూసుకుపోతున్న డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.