6, 9, 5, 22… ఏమిటి ఈ నెంబర్లు..? అయోధ్య రామ మందిరానికి ఈ నెంబర్లకి ఏమిటి సంబంధం?

Ads

అయోధ్య రామ మందిరం నేడు కన్నుల పండుగగా ముస్తాబయింది మోదీ చేతుల మీదుగా బాల రాముడు ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు ఎందరో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. బాల రాముడి కళ్ళకు గంతలు తీసి దిష్టి తగలకుండా కాటుక పెట్టి మహా హారతి ఇస్తారు. దేశం మొత్తం రామనామం జపంతో హోరెత్తిపోతుంది.

ఈ క్రమంలో 6, 9, 5, 12 సంఖ్యలకు రామ మందిరానికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించిన చర్చ తెర మీదకి వచ్చింది అదేమిటో ఇప్పుడు చూద్దాం. 6 నెంబర్ విషయానికి వస్తే 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. ఆరోజు కూడా చరిత్రపుటల్లో నమోదయింది. అలాగే 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రామాలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తేదీ. ఇక 2020 ఆగస్టు 5న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. మొదట ఇటుక కూడా వేశారు.

Ads

ఇది కాకుండా జనవరి 22, 24న శ్రీరాముడు తాత్కాలిక ఆలయం నుంచి తన మందిరానికి మారిన రోజు. ఈ నాలుగు తేదీలు చరిత్రపుటల్లో సజీవంగా తరతరాలపాటు నిలిచిపోతాయి. ఇక ఇప్పటికే అయోధ్య రామయ్య గర్భగుడిలో కొలువు తీరారు. భక్తులకు తొలిదర్శనం ఇచ్చాడు. గర్భగుడిలో ప్రతిష్టించిన రామ్ లల్లా ఫోటోలు బయటకు వచ్చాయి. సాలగ్రామ శిలతో రూపొందించిన శ్రీరాముడు దివ్య రూపం అద్భుతంగా ఉంది.

కమలం పువ్వు పై నిలబడిన బాలరాముడు ఒక చేతిలో బాణం మరొక చేతిలో విల్లు ఉంది. నలుపు రంగులో ఉన్న అయోధ్య రాముని విగ్రహం ఎత్తు 51 అంగుళాలు అంటే దాదాపు నాలుగు అడుగులు ఉంటుంది. రామ జన్మభూమిలో మొత్తం 70 ఎకరాల్లో శ్రీరాముడి ఆలయ కాంప్లెక్స్ ఉంటుంది.ఇందులో 70% పచ్చదనంతో నిండి ఉంటుంది భక్తులు తూర్పుదిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించే దక్షిణం దిక్కు నుంచి బయటికి వస్తారు.

Previous articleఈమె కన్నా వయసు ఎక్కువ ఉన్నవారికి అవకాశాలు ఇస్తున్నారు.. కానీ ఈ 32 ఏళ్ల హీరోయిన్ కి ఎందుకు ఇవ్వటం లేదు..?
Next articleఅయోధ్య రాముడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభ మార్గాల వివరాలు!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.