Ads
ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న యానిమల్ మూవీకి సినీ లవర్స్ రెడీ అయిపోయారు. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, బుకింగ్స్ కానీ రికార్డు సృష్టిస్తున్నాయి. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ మూవీ ఒక ట్రెండ్ సృష్టించే విధంగా ఉంది. అయితే ఈ రోజు విడుదలవుతున్న ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..!
- చిత్రం: యానిమల్
- నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్.
- దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
- నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురద్ ఖేతాని, కృష్ణ కుమార్.
- డిఓపి: అమిత్ రాయ్
- సంగీతం: జాన్ 8,విశాల్ మిశ్రా, జానీ, హర్షవర్ధన్ రామేశ్వర్.
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
- విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
కథ:
రణవిజయ్ సింగ్ (రణబీర్ కపూర్) తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ప్రేమ కోసం చాలా తాపత్రయ పడుతూ ఉంటాడు. తన తండ్రి ప్రేమను పొందడం కోసం ఆయనకి నచ్చిన పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. తన తండ్రి అంటే రణవిజయ్ కి ప్రేమ కాదు పిచ్చి. ఆ తర్వాత తన స్నేహితుడి చెల్లెలు అయిన గీతాంజలి (రష్మిక మందన్న) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
గీతాంజలి ఒక తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. వారికి పిల్లలు కూడా పుడతారు. అయితే వ్యాపారవేత్త అయిన బల్బీర్ సింగ్ మీద ఎవరో దాడి చేస్తారు. ఇది తెలుసుకున్న రణవిజయ్ ఏం చేశాడు? తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు? అసలు బల్బీర్ సింగ్ మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్లని రణవిజయ్ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
యానిమల్ కధ విషయానికి వస్తే ఇది తండ్రి కొడుకులు మధ్య ప్రేమ కథ రూపొందించినట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించాడు. తండ్రి మీద ప్రేమతో ఒక కొడుకు యానిమల్ గా ఎలా మారాడు అనేది సింపుల్ గా చెప్పుకోవాలంటే కధ. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పిల్లల మదిలో ఎలా నిలిచిపోతాయో అన్నది ప్రధానాంశంగా ట్రైలర్ లోనే చూపించారు. అయితే ఒక చిన్న సర్ప్రైజ్ తో నాన్న నువ్వే నా ప్రాణం సాంగ్ తో ఈ కథ మొదలవుతుంది.
తర్వాత హీరోయిన్ గా గీతాంజలి పాత్రలో రష్మిక మందన పరిచయం. రణబీర్ కపూర్ తన కుటుంబంతో జరిగే ఒక ఇంటెన్స్ సీన్ తో కథ ముందుకు వెళుతుంది. ఒక చిన్న టీస్ట్ తర్వాత అమ్మాయి సాంగ్. రణబీర్ కపూర్ వైలెంట్ గా మారడానికి వచ్చే ఒక సీన్,తర్వాత పూర్తిగా యానిమాల్ గా మారిపోయి పరిస్థితులన్నీ తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. టోటల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే నీడివి ఎక్కువగా అనిపించినా కూడా యానిమల్ అనిపించే విధంగా సాగింది.
Ads
యాక్షన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండింది. తర్వాత విలన్ గా బాబి డియోల్ ఎంట్రీ వైలెంట్ గా ఉంటుంది. తర్వాత కుటుంబంలో కొన్ని సంఘర్షణలు.ఇప్పుడు రణబీర్ కపూర్ కి విలన్ కి మధ్య ఫేస్ ఆఫ్. తర్వాత విలన్ కోసం రణబీర్ కపూర్ వెతకడం అలా ప్రీ క్లైమాక్స్ చేరుకుంటుంది. ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్ అనంతరం ఇంటికి రావడం ట్రైలర్ లో చూపించిన ఫాదర్ అండ్ సన్ సీన్ వస్తుంది. లాస్ట్ కి అనిల్ కపూర్, రణబీర్ కపూర్ కి మధ్య ఒక ఎమోషనల్ సీన్ తో సినిమా ఎండ్ అవుతుంది.
ఇది పూర్తిగా సందీప్ రెడ్డి వంగా మార్క్ చిత్రం. వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తాను అన్న మాటకి సందీప్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. రణబీర్ కపూర్ ఇప్పటివరకు చేసిన పాత్రలలో యానిమల్ పాత్ర చిరకాలం నిలిచిపోతుంది. ఈ పాత్రలో రణబీర్ ని తప్ప వేరే ఒకరిని ఊహించుకోలేము. అంత ఇంటెన్స్ గా అంత ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. రష్మిక మందన పాత్ర చాలా బాగుంది. మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసింది. అనిల్ కపూర్ పాత్ర తండ్రిగా మెప్పించింది. ఇక విలన్ గా బాబీ డియోల్ అయితే చెప్పనవసరం లేదు. రణబీర్ కపూర్ కి పోటీ పడి మరీ నటించాడు.
యానిమల్ కి ఇంత వైలెంట్ విలన్ ఉండాలి అనిపించింది. సినిమా నిడివి పెద్దగా ఇబ్బంది పెట్టదు కాని అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇక కెమెరా పనితనం అయితే సినిమా టోన్ కి తగ్గట్టు అద్భుతంగా ఉంది. పాటలు కూడా బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. యాక్షన్ సీన్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ రాజీ పడినట్టు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్:
- కథ, స్క్రీన్ ప్లే
- యానిమల్ గా రణబీర్ కపూర్ నటన
- మిగతా నటీనటులు
- ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
రేటింగ్:
3.75/5
ఫైనల్ గా:
యానిమల్…. మోస్ట్ వైలెంట్ అండ్ ఎమోషనల్ సినిమా. డైరెక్టర్ సందీప్ రెడ్డికి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత ఈ సినిమా ఇంకొక స్థాయికి తీసుకెళ్లే సినిమా అయ్యింది. సినిమా నిడివి గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Watch Trailer:
ALSO READ : Dhootha Web Series Review: నాగ చైతన్య “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!