Ads
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి లాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా ఎదిగిన వారిలో రవితేజ కూడా ఉంటాడు. సినీరంగంలోకి వచ్చిన కొత్తలో లైట్ మెన్ గా ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలామంది డైరెక్టర్స్ వద్ద పనిచేసాడు.
ఆ తరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోను, కొన్నింటిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కూడా నటించాడు రవితేజ. ఈ క్రమంలో కర్తవ్యం, అల్లరి ప్రియుడు, నిన్నే పెళ్లాడతా సినిమాల్లో క్యారక్టర్స్ చేసిన రవితేజకు, డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ‘సింధూరం’ సినిమాతో గుర్తింపు వచ్చినా, రవితేజకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరీ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆ తరువాత వచ్చిన ఇడియట్ సినిమాలతో రవితేజను స్టార్ హీరోగా మార్చాడు. ఇక అక్కడి నుండి రవితేజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రవితేజ కష్టపడి పైకొచ్చాడు. ఆ కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి, డైరెక్షన్ ఛాన్స్ ల కోసం కాళ్ళు అరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగే చాలా మందికి డైరెక్టర్ గా అవకాశాలు ఇచ్చాడు. రవితేజ పరిచయం చేసిన డైరెకర్ల లిస్ట్ కూడా పెద్దదే. వారిలో శ్రీను వైట్ల, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను వంటి వారు పెద్ద దర్శకులుగా మారారు. మరి కొద్దిమంది విజయం పొందకున్న, వాళ్ళకి ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ అనే గుర్తింపును తెచ్చుకున్నారు. మరి మాస్ మహారాజ రవితేజ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకులు ఎవరో, ఏ చిత్రాలతో పరిచయం అయ్యారో ఇప్పుడు చూద్దాం..
Ads
1. శ్రీను వైట్ల : నీకోసం2.అగస్త్యన్ : ఈ అబ్బాయి చాలా మంచోడు3. యోగి : ఒక రాజు ఒక రాణి4.ఎస్.గోపాల్ రెడ్డి : నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్5.బోయపాటి శ్రీను : భద్ర6.హరీష్ శంకర్ : షాక్
7.సముద్ర ఖని : శంభో శివ శంభో8. గోపీచంద్ మలినేని : డాన్ శీను
9.కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ : పవర్10. విక్రమ్ సిరికొండ : టచ్ చేసి చూడు
Also Read: రజినీకాంత్ ని బిచ్చగాడు అనుకుని మహిళ భిక్షం వేసిన వేళ..