Ads
సినీ ఇండస్ట్రీలో కొని మూవీస్ స్టోరీలు చాలావరకు ఒకదాన్ని ఒకటి పోలి ఉండడం కామన్. అలా వచ్చిన సినిమాలలో కొన్ని ఫ్లాప్ అవ్వగా, సేమ్ కాన్సెప్ట్ కొన్ని రోజుల గ్యాప్ తో వచ్చిన సినిమాలు హిట్ అవుతాయి. ఇంత చిన్న విషయానికి కొందరు నానా హడావిడి చేస్తారు. ఎందుకంటే ఏ సినిమా ,ఏ టైం లో ,ఏ ట్రెండుకు సెట్ అవుతుందో అప్పుడు అది హిట్ అవుతుంది. ట్రెండ్ కంటే ముందే సినిమా తీసి అది హిట్ అవ్వలేదు అంటే ఎంతవరకు కరెక్ట్?
ప్రస్తుతం రవితేజ అభిమానుల హడావిడి ఇటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అప్పుడు రవితేజ తీస్తే మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వస్తుంటే మాత్రం హిట్ అవుతున్నాయి అని గోల పెడుతున్నారు అతని అభిమానులు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏమిటి? ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అయిన మూవీస్… ఏమిటో చూద్దాం పదండి
Ads
రవితేజ హీరోగా 2004 లో నా ఆటోగ్రాఫ్…స్వీట్ మెమోరీస్ అంటూ ఒక అబ్బాయి జీవితంలో గడిచిన మూడు ప్రేమ కథలను హైలైట్ చేస్తూ ఓ సినిమా వచ్చింది. పాటల పరంగా పరవాలేదు అనిపించుకున్నా…మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ఇక 2006లో జ్యోతిక, రవితేజ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన షాక్ చిత్రం…. ఇందులో హీరో జైలుకి వెళ్లడం ,హీరోయిన్ …హీరో కోసం తాపత్రయపడడం.. ఆ తర్వాత హీరోయిన్ కోసం హీరో పగ సాధించడం. మంచి మ్యూజికల్ హిట్ అయిన ఈ రివెంజ్ లవ్ స్టోరీ కూడా ఫ్లాప్ అయింది.
రవితేజ నా ఆటోగ్రాఫ్ స్టోరీ లాంటి మరో స్టోరీ తో ప్రేమమ్ అంటూ 2016 లో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా మాంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఈ షాక్….స్టోరీ టైప్ ..జైల్ నేపథ్యం లాంటి కాన్సెప్ట్ తతో వచ్చిన సప్త సాగరాలు దాటి అనే చిత్రం కూడా బాగా హిట్ అయింది. అయితే ప్రస్తుతం రవితేజ ఫాన్స్ ఈ నాలుగు చిత్రాలను కలిపి మీమ్స్ చేసి మరి…మా హీరో తీస్తే హిట్టుగా కాలేదు…తర్వాత మాత్రం హిట్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.