TIGER NAGESWARA RAO REVIEW: “టైగర్ నాగేశ్వరరావు” సినిమా ఎలా ఉంది అంటే.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈరోజు గ్రాండ్ గా విడుదల అయింది. రిలీజ్ కి ముందు నుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే కష్టపడి నేర్చుకొని మరి సొంతంగా ఐదు భాషలలో రవితేజ తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. మరి ఈ మూవీ ఎటువంటి రెస్పాన్స్ సంపాదించుకుందో తెలుసుకుందాం పదండి..

మూవీ: టైగర్ నాగేశ్వరరావు
దర్శకత్వం: వంశీ
నటులు: రవితేజ,అనుపమ్ ఖేర్,నూపూర్ సనన్రేణు దేశాయ్,జిషు సేన్‌గుప్తా
సినిమాటోగ్రఫీ: ఆర్.మధి
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
విడుదల తేది: 20 అక్టోబర్ 2023

స్టోరీ

స్టోరీ విషయానికి వస్తే ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకప్పుడు గడగడ లాడించిన స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అన్న విషయం అందరికీ తెలిసిందే. పేరు మోసిన దొంగగా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ టైగర్ నాగేశ్వరరావు అనుకోకుండా ఓ పెద్ద ట్రాప్ లో చిక్కుకుంటాడు. అయితే ఆ తర్వాత అతని కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

సంఘసంస్కర్త హేమలతల లవణం స్టువర్టుపురంలో ప్రజల మార్పు కోసం ప్రయత్నిస్తూ మరోపక్క వారిపై ప్రజలపై పోలీసులు చేసే అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఎటువంటి మలుపు చోటు చేసుకుంటుంది? చివరికి అతను ఏం చేస్తాడు? ఈ చిత్రంలో హేమలత లవణం పాత్ర ఏమిటి? ఈ మూవీ ద్వారా డైరెక్టర్ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. తెలియాలి అంటే కచ్చితంగా తెరపై సినిమాని చూడాల్సిందే.

Ads

విశ్లేషణ:

ఈ మూవీ ని 1980 దశకంలో చూపించడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మాస్ మహారాజ్ ఎంట్రీ సన్నివేశం ఆకట్టుకునే విధంగా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నాజర్ దగ్గర మిగిలిన వాళ్ళతో కలిసి దొంగతనానికి ట్రైనింగ్ పొందుతున్న నాగేశ్వరరావు క్రమంగా పేరు మోసిన తెలివైన దొంగగా ఎదుగుతాడు. ఇక ట్రైన్ దొంగతనం సీన్ అయితే వేరే లెవెల్ లో ఉంది.

మూవీలో మాస్ ఎలివేషన్ అద్భుతంగా ఆకట్టుకునే విధంగా చిత్రీకరించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ కాస్త స్లోగా సాగదీతగా ఉన్న ఒన్స్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కామెడీ పరంగా కూడా పర్వాలేదు. ఇంటర్వెల్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. ఇది కచ్చితంగా రవితేజ కి మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్లస్ పాయింట్స్:

  • మూవీ స్టార్టింగ్ లో రవితేజ మాస్ ఎంట్రీ మూవీకి హైలైట్ గా నిలుస్తుంది.
  • ప్రతి ఒక్క సీన్ ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించడం జరిగింది.
  • స్టోరీ స్క్రీన్ ప్లే రెండు అద్భుతంగా సెట్ అయ్యాయి.
  • నెరేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
  • ఫైట్స్
  • పతాక సన్నివేశాల్లో బీజీఎమ్
  • ఇంటర్వెల్

మైనస్ పాయింట్స్:

  • సాగదీసిన సెకండ్ హాఫ్
  • పాటలు

రేటింగ్: 3 / 5

చివరి మాట:

కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి యాక్షన్ పీరియడ్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దసరా సెలవల్ని కుటుంబ సమేతంగా మంచి మూవీ చూస్తూ ఎంజాయ్ చేయండి.

Previous articleవరల్డ్ కప్ లో టీం ఇండియాకి చీర్ చేస్తున్న ఈ “మిస్టరీ గర్ల్” ఎవరో తెలుసా.?
Next article1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.