Ads
తాజాగా ఆదివారం జరిగిన ఐసీసీ టోర్నమెంట్ లో భారత్ కు మరోసారి ఊహించిన విధంగా తీవ్ర ఎదురైంది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ మరోసారి ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు అన్ని ఆవిరి అయ్యాయి.
అయితే భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 6 వికెట్ల ఓడిపోయింది. అయితే టీమిండియా ఓటమికి నాలుగు ప్రధాన కారణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..
#1. టాస్ ఓడిపోవడం అన్నది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ మందకొడిగా ఉన్న పిచ్‌పై చెలరేగింది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకొని ఉండి ఉంటే ఆసీస్ కూడా బ్యాటింగ్‌లో తడబడేది. అప్పుడు టీమ్ ఇండియాకి కలిసొచ్చేది.
#2. ఇక రెండవ కారణం టాపార్డర్ వైఫల్యం. ప్రపంచ కప్ లో సత్తాను చాటిన టీమిండియా టాపర్డర్ కానీ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని శాసించింది. ఆరంభంలోనే గిల్ వెనుదిరగ్గా కీలక సమయంలో చెత్త షాట్‌తో రోహిత్ శర్మ ఔటవ్వడం అన్నది మ్యాచ్‌ను ఊహించని మలుపు తిప్పింది. ఈ ఇద్దరూ అదిరిపోయే ఆరంభం అందించి ఉంటే తర్వాతి బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేసేవారు.
Ads
#3. ఇక మూడవ కారణం కరెక్ట్ సమయంలోనే కోహ్లీ అలాగే రాహుల్ అవుట్ అవ్వడం. 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకున్న కోహ్లీ, రాహుల్ చివరి వరకు ఆడకపోవడం కూడా టీమ్ ఇండియా కొంపముంచింది. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కోహ్లీ దురదృష్టవశాత్తు వెనుదిరగడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తయిన అనంతరం ధాటిగా ఆడిన పరిస్థితుల్లో ఔటవ్వడం టీమిండియా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. అయితే ఆ ఇద్దరిలో ఒక్కరైనా చివరి వరకు కనుక ఆడి ఉంటే టీమిండియా 280-290 పరుగులు చేసేది. అప్పుడు భారత బౌలర్లకు కూడా అవకాశం ఉండేది.
#4. ఇక నాలుగో కారణం ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయకపోవడమే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయకపోవడం ఓటమిని శాసించింది. అతనికి తగ్గ ప్రణాళికలు భారత బౌలర్ల వద్ద లేకపోవడం తీవ్ర నష్టం చేసింది. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి ఉంటే 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా కాపాడుకునేది. అతనొక్కడే అసాధారణ సెంచరీతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇలా ఈ నాలుగు తప్పిదాలతో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవి చూసింది.