REASONS FOR SEPARTATION OF HUSBAND AND WIFE:భార్యాభర్తలు విడిపోవడానికి ఇవే ప్రధాన కారణాల… వీటివల్లే విడిపోతున్నారా?

Ads

ప్రస్తుత కాలంలో ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వెంటనే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే వారు విడిపోవడానికి పెద్ద కారణాలు ఏమీ ఉండవు చిన్న కారణాన్ని వాళ్ళు పెద్దదిగా చూపిస్తూ విడిపోవడం జరుగుతుంది. భార్యాభర్తలను తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం ఆ క్షణం ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఆ గొడవ అంతటితో ఆగిపోతుందని తిరిగి వారు ఎంతో అందమైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.

చాలామంది చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు మరి భార్య భర్తలు విడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం… భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట ఉన్నప్పుడు ఎవరి మొబైల్ ఫోన్లో వారు కాలక్షేపం చేస్తూ ఉండటం పెద్ద తప్పు ఇలా ఉండటం వల్ల వారికి ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు ఉండవని తద్వారా దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాలి. అలాగే ఒకరి బాధను మరొకరు పంచుకోకపోవడం వల్ల కూడా ఒకరికొకరు దూరం కావాల్సి ఉంటుంది.

Ads

మీ జీవిత భాగస్వామి ఏదైనా ఒక విషయంలో బాధపడుతూ ఉన్నారు అంటే తప్పనిసరిగా వారి బాధను తెలుసుకుని వారిని ఓదార్చినప్పుడే మీ బందం బలపడుతుంది అలా కాకుండా నాకెందుకులే అని ఉన్నప్పుడు మీ బంధం బీటలు బారుతుంది. ఇక చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి శృంగార సమస్యలు కూడా కారణమని తెలుస్తుంది. పెళ్లైన మొదట్లో శృంగారం పట్ల ఆసక్తి ఉండేవారు తర్వాత కొన్ని కారణాల వల్ల శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపరు ఇలా శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోయిన సమయంలో కూడా మీ బంధం బలహీన పడుతుందని అర్థం.

భార్యాభర్తల బంధంలో బాధ్యత అనేది ఎంతో ముఖ్యం ఇలా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు గౌరవం ఇచ్చుకొని బాధ్యతగా వ్యవహరించాలి అదేవిధంగా ఒకరి సమస్యలను మరొకరు తెలుసుకొని ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే బంధం బలపడుతుందని అయితే ఇలాంటివి ఇప్పుడు ఉన్నటువంటి భార్యాభర్తలలో తగ్గిపోవడం వల్లే విడిపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

Previous articleఫాలోయింగ్ లో అల్లు అర్జున్ నే దాటేసింది..! ఈ అమ్మాయి ఎవరంటే..?
Next articlePINDAM REVIEW : గర్భిణీలు చూడకూడదు అన్న ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.