Ads
తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హీరోగా,కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్ తాజాగా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపుగా 932 సినిమాల్లో నటించిన మరొక కళామతల్లి ముద్దుబిడ్డ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఇది ఏడాది కళాతపస్వి విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన మరణించారు. అయితే ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అన్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్ తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రాన్ని విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా చంద్రమోహన్ అందులో కీలపాత్ర పోషించారు.
Ads
ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి జాతీయ అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.
చంద్రమోహన్ పెదనాన్న కుమారుడే కె విశ్వనాథ్. ఇదే విషయాన్ని చంద్రమోహన్ ఒకానొక సమయంలో తెలిపారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విశ్వనాథం చనిపోయిన సమయంలో చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం దగ్గరికి వెళ్లి బోరున విలపించిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా, చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.
అలాగే ఎస్పీ బాలసుబ్రమణ్యం తో ఉన్న బంధుత్వం విషయానికి వస్తే.. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం.