“నాకు మరో జన్మనిచ్చారు..!” అంటూ… “రేణు దేశాయ్” ఎమోషనల్ పోస్ట్..!ఏం అన్నారంటే..?

Ads

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 20 సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్ళీ వెండి తెరకు రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హేమలత లవణం పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

అయితే తన తదుపరి సినిమాల విషయంలో రేణు దేశాయ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు తన పిల్లలు అకిరా, ఆధ్యతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో అకిరా ఆద్య కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అకీర పియానో వాయిస్తూ తన టాలెంట్ ని చూపించి కుటుంబ సభ్యులందరి మెప్పు పొందాడు. దాంతో పాటు అకిరా లుక్ ని చూసిన అందరూ కూడా జూనియర్ పవర్ స్టార్ వచ్చేసాడు అంటూ ఆనందపడ్డారు. పవర్ స్టార్ యుక్త వయసులో ఉన్న ఫోటోలను అకిరా ఫోటోలతో కంపేర్ చేస్తూ ట్రెండ్ సృష్టించారు.

ఇక ఆధ్యా కూడా తన అక్కలు, వదినలతో కలిసి చాలా యాక్టివ్ గా పాల్గొంది. సంక్రాంతి పండుగ రెండు రోజులు కూడా పవర్ స్టార్ పిల్లలు ఇద్దరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. తమ పిల్లలకు వస్తున్న పొగడ్తలు చూసి రేణు దేశాయ్ చాలా సంతోషపడ్డారు. నేను మీకు జన్మనివ్వడం కాదు మీరే నాకు మళ్ళీ తిరిగి జన్మనిచ్చారు అంటూ తన పిల్లలను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రేణు దేశాయ్ ఒక తల్లిగా తన బిడ్డల ఎదుగుదలను చూసి ఎంతో ఆనందపడుతుంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

watch video :

Previous articleఒకే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయాడు..! ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?
Next articleఅయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం..! అసలు విషయం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.