Ads
తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే డిసెంబర్ 9వ తారీకు నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఎప్పుడు నష్టాల్లో ఉండే ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనిపిస్తే మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాగే కర్ణాటకలో కూడా మహిళలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే బస్సు టికెట్ ఫ్రీ అయినా కూడా ఆర్టీసీకి సైడ్ ఇన్ కమ్ పెరిగిందట. మహిళలు ఎక్కడికెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు.
Ads
మహిళలు ఒక్కరే వెళ్లరు కాబట్టి వారితో వచ్చే పురుషుల సంఖ్య కూడా పెరగడంతో ఆర్టీసీకి ఆ రూపంలో ఆదాయం వస్తుందట. దీనితోపాటు టూరిజం కూడా పెరిగిందని దీనివల్ల ఆర్టీసీకి సైడ్ ఇన్ కమ్ వచ్చి చేరుతుందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 7200 బస్సులు ఉన్నాయి ఇప్పటికే ఈ బస్సులు ప్రజలకు సరిపోవడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ప్రతి బస్సు రద్దీ అయిపోతుంది.త్వరలో తెలంగాణలో కొత్త
ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉం