Ads
ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీలో భారత జట్టు కీలక పోరు రెడీ అయ్యింది. ప్రపంచ కప్ ఫైనల్ లో చోటు దక్కించుకోవాలంటే నేటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై తప్పనిసరిగా విజయం సాధించాలి.
ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీంఇండియా, న్యూజిలాండ్ ఇప్పటికే ముంబైకి చేరుకున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్ కు ముందుగా భారత ఆటగాళ్లకు, ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోమని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ ప్రపంచకప్ 1996 టోర్నీ భారత్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్, శ్రీలంకతో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్, ఓపెనర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దు మూడు పరుగులకే అవుటైనా, రెండో ఓపెనర్ సచిన్ టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ తో రెండవ వికెట్ కు 95 రన్స్ చేశాడు.
సచిన్ 9 ఫోర్లు కొట్టి 65 పరుగుల దగ్గర ఉండగా భారత్ గెలుపు సాధిస్తుందని అంతా భావించారు. అయితే జయసూర్య బౌలింగ్ లో సచిన్ భారీ షాట్ కు ట్రై చేసి, స్టంపౌట్ అయ్యాడు. అప్పటి దాకా గెలిచేలా కనిపించిన టీంఇండియా బ్యాటింగ్ గాడి తప్పింది. 98 పరుగులకు ఒక వికెట్ పడగా, సచిన్ అవుట్ అయిన తరువాత 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 22 రన్స్ వ్యవధిలో 7 వికెట్లు పోగొట్టుకున్న భారత్ సెమీస్ లో ఓటమిపాలయ్యింది.
ఇప్పుడు భారత్ సొంత గడ్డ పై మరోసారి ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడబోతుంది. ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. తన బ్యాటింగ్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. 1996లో సచిన్ టెండూల్కర్ లాగా అనవసరమైన షాట్ కు ప్రయత్నించకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. రోహిత్ మాత్రమే కాకుండా కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు కూడా అనవసరపు షాట్ ప్రయత్నించి, అవుట్ కావొద్దని సూచిస్తున్నారు.
Ads
Also Read: న్యూజిలాండ్ జట్టులో ఉన్న ఈ 3 బలహీనతల్ని క్యాష్ చేసుకుంటే…సెమీస్ లో గెలుపు భారత్ దే.!