Ads
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా కూడా హైదరాబాదులోని హబ్సిగూడ రవీంద్ర నగర్ కాలనీలో ఒక తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి బలి అయింది. రెండేళ్ల చిన్నారికి నూరేళ్లు నిండాయి. అసలేం జరిగిందంటే..
హైదరాబాదులోని హబ్సిగూడ రవీంద్ర నగర్ కాలనీలో నివాసం ఉండే మిథున్ కు ఇద్దరు పిల్లలు. కూమారుడు స్థానికంగా ఒక పాఠాశాలలో చదువుతుండగా రెండేళ్ల చిన్నారి జావ్లానా ఇంటి వద్దే ఉంటోంది. అయితే తాజాగా జనవరి 4న ఉదయం పిల్ల వాడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు తండ్రి, అమ్మమ్మ కలిసి బయటకు వచ్చారు. ఆ సమయంలో పాప కూడా వారితోనే ఉంది. తన కుమారుడిని స్కూల్ బస్ ఎక్కించిన మిథున్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగా.. అమ్మమ్మ వద్ద ఉన్న చిన్నారి నాన్న అంటూ అతడి వద్దకు ఒక్కసారిగా పరిగెత్తింది.
Ads
ఈ క్రమంలో డ్రైవర్ గమనించక బస్సును మూవ్ చేయడంతో ప్రమాదవశాత్తు టైరు కిందపడి అక్కడికక్కడే చిట్టీ తల్లి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్పాట్‌కు చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మొత్తానికి ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి బలి అయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ చిన్నారిని అలాంటి పరిస్థితుల్లో చూసిన తల్లిదండ్రులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు.