Ads
ప్రభాస్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. టీజర్ లో తమ హీరో ఫేస్ చూపించకుండా డైనోసర్ అని సరిపెట్టడడంతో ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్ళు ఆత్రంగా ఎదురు చూశాయి.
Ads
హోంబాలే ఫిలిమ్స్ ముందుగానే ప్రకటించినట్టు సమయానికే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ రిలీజ్ తర్వాత కన్నడ మూవీ ‘ఉగ్రం’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘కేజియఫ్’ సినిమాల తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. అలాంటి డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ అని ప్రకటించినప్పటి నుండి సలార్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మూవీ అప్డేట్స్ కోసం అందరు ఎదురుచూశారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఉగ్రంకు రీమేక్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెండు స్టోరీలను పోలుస్తున్నారు. ‘సలార్’ ట్రైలర్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులు అని ట్రైలర్ చూసినవారికి అర్థం అవుతుంది. కుర్చీ కోసం జరిగే యుద్ధంలో శత్రువులు వేర్వేరు దేశాల సైన్యాలను దింపితే, పృథ్వీరాజ్ మాత్రం తన ఫ్రెండ్ ను పిలుస్తాడు. ప్రాణం కన్నా ఎక్కువ అయిన స్నేహితులు ఇద్దరు శత్రువులు మారినట్టు తెలుస్తోంది.
ఉగ్రం స్టోరీలో హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. చీకటి సామ్రాజ్యంలో ఫ్రెండ్ టాప్ ప్లేస్ లో ఉండాలని అతని కోసం పోరాడడానికి ఫ్రెండ్ వస్తాడు. అందరినీ ఎదురించి మాఫియా కింగ్ గా నిలబెడతాడు. ఆ తర్వాత ఇద్దరు శత్రువులుగా మారతారు. నెటిజెన్లు ఈ రెండింటిలో పోలీకలున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఛత్రపతి, కబ్జా సినిమాలు గుర్తుకు వస్తునాయని కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత నీల్ ఉగ్రం రీమేక్ కాదని చెప్పాడు. కానీ కథ చూస్తుంటే ఉగ్రం మూవీని అప్ గ్రేడ్ చేసి భారీ బడ్జెట్ తో తీసినట్టు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ప్రభాస్ “సలార్” ట్రైలర్‌లో… ఈ 5 విషయాలు మైనస్ అయ్యాయా..?