Ads
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత.. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే సమంత తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మీడియాలో హడావుడి ప్రారంభమైంది, ఆమె ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుందని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన “ఖుషి” సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. కాకపోతే ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది.
Ads
తాజాగా సోషల్ మీడియా ఫ్యాన్ ఇంటరాక్షన్ లో “మీ చర్మ కాంతి రహస్యం ఏంటి.?” అని ఓ అభిమాని ప్రశ్నించగా…అలాంటిది ఏమి లేదు, మయోసైటిస్ తో చాలా ఇబ్బంది పడ్డాను. స్టెరాయిడ్స్ తీస్కోడం వల్లే విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చి చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. అందుకే నా ముఖం ఇలా అయిపొయింది అంటూ చెప్పుకొచ్చారు సమంత.