Ads
ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో తన చీర, కట్టుబొట్టుతో జెస్సీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమంత . ఆ జెస్సి అందానికి కి కుర్రాళ్లే కాదు లేడీస్ కూడా ఫిదా అయిపోయారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తూ చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది సమంత.
ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది కూడా. పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ వాటితో ఫైట్ చేస్తూ తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది ఈ భామ. అయితే ఇప్పుడు సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్, సమంతలు కలిసినటించిన సినిమాలోని సాంగ్ ఒకటి నెట్ లో హల్చల్ చేస్తుంది. అది గోరే గోరే అనే సాంగ్. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఈ సినిమా ఎప్పుడు తీశారు అంటూ తెగ ఆశ్చర్యపోయారు.
అయితే అందరూ అనుకుంటున్నట్లు సమంతకి తొలి సినిమా ఏ మాయ చేసావే కాదు. ఆమె, రాహుల్ రవీంద్రన్ హీరోగా 2007లో మాస్కోవిన్ కావేరి అని సినిమాలో నటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. అప్పటికే ఏ మాయ చేసావే సినిమా విడుదల అవటం వలన సమంత తొలి సినిమా అందరూ ఏ మాయ చేసావే అనుకున్నారు. ఆ సినిమాలో సీనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో. నిజానికి సమంత, చిన్మయి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్మయి భర్త రాహుల్ కూడా సమంతకి మంచి ఫ్రెండ్.
Ads
View this post on Instagram