Ads
భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా అందరికీ పరిచయమే… భారత తరఫున ఎన్నో ఆటలు ఆడారు, ఎన్నో టైటిల్స్ గెలిచారు. తరచూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటారు అయితే ఈసారి కూడా సానియా మీర్జా బాగా వైరల్ అయ్యారు.. అయితే ఇది తన జీవితంలో ఒక విషాద అంశం కావడం గమనార్హం.
సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం సంచలనం అయింది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారని రూమర్స్ బాగా వ్యాపించాయి. దానికి అనుకూలంగా సోషల్ మీడియా ఖాతాలో నుండి సానియా మీర్జా తన భర్త ఫోటోలు డిలీట్ చేసింది. వెంటనే షోయబ్ మాలిక్ కూడా తన ఖాతాలో సానియా మీర్జా పేరు తొలగించాడు. ఇది విడాకుల రూమర్ కి మరింత బలం చేకూర్చింది.
Ads
తాజాగా షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనేది ఖాయం అయిపోయింది. ఈ విషయంపైనే సానియా మీర్జా,షోయబ్ మాలిక్ లు తరచూ గొడవ పడుతూ ఉండేవారట. పెళ్లి చేసుకోక ముందే షోయబ్ మాలిక్ సనాతో సహజీవనం చేసేవాడట.
ఆ కారణంతోనే విడాకులు తీసుకున్నారని… విడాకులు కూడా సాంప్రదాయ బద్ధంగానే జరిగాయని సానియా మీర్జా తండ్రి ప్రకటించాడు. అయితే విడాకులపై మొదటిసారి స్పందించిన సానియా మీర్జా జీవితంలో పెళ్లి కష్టమైనదే… విడాకులు కూడా కష్టమైనవే… మీకు ఏది కష్టమైతే దాన్ని ఎంచుకోండి అంటూ పోస్ట్ పెట్టారు.