Ads
కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి. ఈ సినిమాని సైడ్ A, సైడ్ B గా రెండు పార్ట్ లలో రూపొందించారు. సైడ్ A సెప్టెంబరు లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. డీసెంట్ ఫిలిం గా అందరికీ నచ్చేసింది. హీరో, హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమా విడుదలయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూద్దాం….!
- మూవీ: సప్త సాగరాలు దాటి సైడ్ B
- నటీనటుల: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, అచ్యుత్ కుమార్,పవిత్ర లోకేష్, చైత్ర.
- దర్శకుడు:హేమంత్ .ఎం. రావ్
- సంగీతం:చరణ్ రాజ్
- కెమెరా: అద్వైత గురుమూర్తి
- రిలీజ్ డేట్: నవంబర్ 17
స్టోరీ:
పదేళ్ల తర్వాత జైలు నుండి మను (రక్షిత్ శెట్టి) బయటికి వచ్చేసరికి ప్రపంచం అంతా కోవిడ్ తో బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు మను… ప్రియా (రుక్మిణి వసంత్) కోసం ఆరాటపడుతూ ఉంటాడు. మను గత జీవితంలోనీ పాత క్యాసెట్ అతనికి ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. మనుకి తన స్నేహితుడు ప్రకాష్ (గోపాలకృష్ణ దేశ్ పాండే ) కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సహాయం చేస్తాడు. ఆ క్రమంలో మను సురభి(చైత్ర జే అచర్) కి దగ్గరవుతాడు, ఆమెలో ప్రియా ని చూసుకుంటాడు. కొద్దిరోజులు గడిచేసరికి ఆమె ప్రియ లాంటిది కాదని తెలుసుకుంటాడు.
కానీ ఆమెకి అనుకోకుండా దగ్గరవుతాడు. కానీ ప్రియ తను కలలు కన్న జీవితం జీవిస్తుందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటాడు. తనని ఫాలో చేస్తూ అమే జీవితంలో ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకుంటాడు. తర్వాత ప్రియా తను అనుకున్న విధంగా లేదని తన జీవితంలో బాధ అనేది ఉంది అని తెలుసుకుని, ఆమె కోరుకున్న ప్రేమను, సంతోషాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. మరి మను ఆ విషయంలో సక్సెస్ అయ్యాడా లేదా అనేది పూర్తి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
Ads
సైడ్ A తో పోలిస్తే సైడ్ B చాలా స్లో గా మొదలవుతుంది. ఆడియన్స్ కి మను కొత్త ప్రపంచం, మనుషులు పరిచయం అవుతారు. కానీ కథలోకి తీసుకు వెళ్లడానికి మాత్రం ఎక్కువ సమయం పట్టదు.సైడ్ A లో మంచి నటన కనబరిచిన రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కూడా అదరగొట్టేసారు. సైడ్ A లో మను లవర్ బాయ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తే సైడ్ Bలో మాత్రం సగం చచ్చి, సగం బ్రతికిన మనిషిలా ఉంటాడు.
రుక్మిణి వసంత్ బిడ్డకు తల్లిగా,భార్యగా వేరియేషన్స్ చూపించింది. సురభి అనే ఒక అమ్మాయి పాత్రలో చైత్ర ఇమిడిపోయింది. సాధారణంగా ఎంతో మంది చేయడానికి ఇబ్బంది పడే కొన్ని సన్నివేశాలు మంచి కాన్ఫిడెన్స్ తో చేసింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. కథను ముందుకు తీసుకువెళ్లేందుకు బాగా హెల్ప్ అయ్యారు. రక్షిత్ శెట్టి లో నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో డైరెక్టర్ హేమంత్ సక్సెస్ అయ్యాడు.
తన కళ్ళతో హావభావాలు పలికించిన తీరు అమోఘం. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్ కి తగ్గట్టు ఉంది. చరణ్ రాజ్ సంగీతం అయితే థియేటర్ నుండి వచ్చేసిన తర్వాత కూడా ఆడియన్స్ ని వెంటాడుతుంది. ఫ్రీ క్లైమాక్స్ సీన్ మాస్ ఆడియన్స్ కోసం ఇరికించినట్టుగా అనిపించింది. క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటన
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
- కథ నడిపించిన విధానం
మైనస్ పాయింట్స్:
- స్లో నేరేషన్
- క్లైమాక్స్ సాగదీత
- అనవసరంగా ఇరికించిన సన్నివేశాలు
రేటింగ్: 3.25/5
చివరి మాట:
ఫైనల్ గా సప్త సాగరాలు దాటి సైడ్ A చూసిన వారికి సైడ్ B ఇంకా బాగా నచ్చుతుంది. సైడ్ A చూడకపోయినా కూడా సైడ్ B మంచి ఫీల్ అయితే కలిగిస్తుంది.
watch trailer :
ALSO READ : RX 100 కాంబో ఈసారి థ్రిల్లర్ “మంగళవారం” తో హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!