Ads
ఐపీఎల్ 2024 ఈ రోజు మొదలైంది. ప్రేక్షకులు కూడా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ కొన్ని నెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అసలు ఏ జట్టు కూడా కొనుగోలు చేయని ఒక ప్లేయర్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడబోతున్నారు. అతనే సర్ఫరాజ్ ఖాన్. ఐపీఎల్ మినీ వేలంలో ఏ జట్టు కూడా సర్ఫరాజ్ ఖాన్ ని కొనుగోలు చేయలేదు. ఇ
ప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు కోసం ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ చేరుతారు అనే వార్త బయటకు వచ్చింది. యువ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రాబిన్ మింజ్ కి కొద్ది రోజుల క్రితం ఒక బైక్ ప్రమాదం జరిగింది. ఐపీఎల్ మినీ వేలంలో 3.6 కోట్ల రూపాయలకి ఇతనిని కొనుగోలు చేశారు.
Ads
ప్రమాదంలో రాబిన్ కి పెద్దగా గాయాలు కాలేదు. కాబట్టి రాబిన్ జట్టు తరపున ఆడతారు అని అన్నారు. కానీ నిన్న జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్ర ఈ విషయం మీద మాట్లాడుతూ, రాబిన్ ఈ లీగ్ మొత్తం నుంచి అవుట్ అయ్యారు అని చెప్పారు. ఇప్పుడు రాబిన్ స్థానంలో మరొక ప్లేయర్ కావాలి కాబట్టి, అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకుందామని జట్టు ఆలోచనలో ఉంది. వేలంలో అమ్ముడుపోలేదు. అయినా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ ఆడాలి అనే ఆశతోనే ఉన్నారు.
సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగ్రేటం చేశారు. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ ఎంతో అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. అంతే కాకుండా, టెస్ట్ లో జరిగిన రెండు ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీలు చేశారు. కాబట్టి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే సర్ఫరాజ్ ఖాన్ కి తన టాలెంట్ నిరూపించుకోవడానికి మరొక అవకాశం దొరికినట్టు అవుతుంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.