“ఇలాంటి సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… నితిన్ “ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్” మూవీ మీద కామెంట్స్..!

Ads

తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ ప్రేక్షకుల నుండి సెలబ్రెటీల వరకు ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే. విజయ్ మరియు రష్మిక మాత్రం తమ మధ్య ఉంది ప్రేమ కాదని స్నేహం మాత్రమే అని చెబుతూ చాలా క్లోజ్ గా కనిపిస్తారు.

Ads

దాంతో వీరి ప్రేమ పై ప్రచారాలు కొద్దిరోజుల క్రితం వరకు సోషల్ మీడియాకే పరిమితం అయ్యి ఉండేవి. ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలు సైతం వీరి గురించి మాట్లాడుతుంటే, వీరి ప్రేమకథ నిజమేనేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయం పై నితిన్ ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మేన్‌ లో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గీతా గోవిందం సినిమాతో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. డియర్ కామ్రేడ్ మూవీలో రెండవసారి జత కట్టారు. ఆ మూవీలో కూడా ఈ జంట ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ కలిగిందని, సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలలో బ్యాక్ గ్రౌండ్ కూడా ఒకేలా ఉండడంతో ఇద్దరూ ఒకే ప్లేస్ లోనే ఉన్నారని కూడా ప్రచారం ఎక్కువ అయ్యింది.
రీసెంట్ గా హీరో నాని నటించిన ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా విజయ్, రష్మిక పర్సనల్ ఫోటోలు కనిపించడంతో అటు సోషల్ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం  తెలిసిందే. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో కూడా విజయ్, రష్మిక రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
ఇందులో విజయ్, రష్మిక మధ్య రిలేషన్ ఏంటని జూనియర్ ఆర్టిస్టు పాత్ర చేసిన నితిన్ ను అడుగగా జులాయి సినిమాలోని “నేనేం చేస్తే నీకేంటి?” అనే సాంగ్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా నటించిన నితిన్ క్యారెక్టర్ నేప‌థ్యంలో కొన్ని స్ఫూఫ్‌ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సీన్స్ అందరికి నచ్చలేదు. దాంతో ఆ సీన్స్ ఎందుకు పెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అవికా గోర్ “వధువు” వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Previous article“హాయ్ నాన్న” సినిమాలో జరిగినట్టే వీళ్ళకి కూడా జరిగిందా..? ఈ వ్యక్తి పోస్ట్ చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Next articleతెలుగు హీరోలందరినీ కలుస్తున్న ఈ వ్యక్తులు ఎవరు..? అసలు వీళ్ల ప్లాన్ ఏంటి..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.