జెర్సీ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

Ads

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు. ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా సినిమాకి పని చేసిన వాళ్ళ అందరి బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ని ఎంత పొగుడుతారో, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ ని అంతే ట్రోల్ కూడా చేస్తారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. మనందరం చెప్పే హిట్ లేదా ఫ్లాప్ అనే రెండు మాటల మీద ఆ డైరెక్టర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు.

scene in jersey movie

 

ఇలాంటి వాటిని పూర్తిగా తప్పు అని చెప్పలేం. అలా అని పూర్తిగా కరెక్ట్ అని కూడా చెప్పలేం. ప్రతి సీన్ వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు మిస్టేక్ అనిపించేది ఒకవేళ అందులో కరెక్ట్ అయి ఉండొచ్చు ఏమో అని అనిపిస్తుంది. అందుకే వీటిని లాజిక్ కిందకి కన్సిడర్ చేయడమే కరెక్ట్. ఇలాంటి లాజిక్ కొంచెం అటూ ఇటూ అయిన సీన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి. ప్రస్తుతానికి దానికి ఉదాహరణ  ఒకటి చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే.

Ads

 

ఒకటి జెర్సీ. ఈ సినిమాలో తప్పులు ఉన్నాయా? అని అనుకోకండి. ఇది తప్పు కాదు. ఇందాక పైన చెప్పినట్టుగా ప్రతి సీన్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదంతా చూపిస్తే సినిమా డ్యూరేషన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొంత మంది డైరెక్టర్లు బ్యాక్ స్టోరీ చూపించడానికి ఎక్కువ ప్రిఫర్ చేయరు. కాబట్టి మనకి స్క్రీన్ మీద కనిపించిన దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయానికి వస్తే. హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో గడ్డం ఉండదు. హీరో క్రికెట్ ఆపేసి వేరే జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా గడ్డం ఉండదు. కానీ సినిమా మొదట్లో ఒక సీన్ లో హీరో క్రికెట్ ఆడిన ఫోటోలని హీరో వాళ్ళ కొడుకు చూస్తూ ఉంటాడు.

 

ఆ ఫోటో లో హీరో కి గడ్డం ఉంటుంది. గెటప్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ ఫోటో ని చూసి “ఈ ఫోటోలో  నువ్వు నవ్వుతున్నావ్. నువ్వు నవ్వితే బాగుంటుంది” అని హీరో తో హీరో వాళ్ళ కొడుకు చెప్తాడు. ఇది కూడా అంతే. బహుశా అప్పుడు హీరోకి ఆ మ్యాచ్ ఆడినప్పుడు గడ్డం పెరిగే ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. పైన చెప్పినట్టుగా ఇది పూర్తిగా తప్పు అని చెప్పలేము. కానీ మనకి చూపించిన దాని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో హీరో గెటప్ అది కాదు కాబట్టి, ఒక చిన్న డౌట్ వస్తుంది అంతే.

ఇంకా డైరెక్టర్ కష్టం గురించి తెలుసు కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని పెద్దగా, కాదు కాదు అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వాటి మీద సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయం కూడా ఆధారపడి ఉండదు. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు, ఏదైనా మనకి చూపించిన దాని ప్రకారం ఉండనప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంతే.

Previous articleడాక్టర్ అంబేద్కర్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రేమలేఖలో ఏం రాశారంటే..?
Next articleఇంత సంపన్న కుటుంబంలో ఉంటున్నా కూడా… నాగార్జున భార్య అమల బంగారం ఎందుకు ధరించరు..? కారణం ఏంటో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.