Ads
సాధారణంగా నిద్రపోయిన సమయంలో కొంతమందికి కలలో చనిపోయిన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు,లేదంటే మిత్రులు, తెలిసినవారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించినపుడు ఒక్కసారిగా భయంతో నిద్ర నుండి లేస్తూ ఉంటారు. ఆ తరువాత కూడా వారు భయాందోళనలకు గురవుతూనే ఉంటారు. అయితే అలా మరణించిన పూర్వీకులు కలలో కనిపించడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయని అంటున్నారు.
Ads
స్వప్న శాస్త్రంలో చెప్పిన ప్రకారం చనిపోయిన పూర్వీకులు కలలో కనిపిస్తున్నారంటే వారు కలల ద్వారా మీకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. అలా పూర్వీకులు కనిపించిన కలలను పట్టించుకోవాలని, తేలికగా తీసుకోవద్దని స్వప్న శాస్త్రం చెబుతుంది. పితృపక్షానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పితృపక్షం భద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మొదలై అశ్విని మాసంలో వచ్చే అమావాస్యరోజుతో ముగుస్తుంది. ఇక పితృపక్ష రోజుల్లో మరణించిన పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తుంటారు. ఆ రోజుల్లో పితృదేవతలు భూమికి వస్తారని ప్రజలు చాలామంది నమ్ముతుంటారు. పితృపక్షం రోజుల్లో కనుక పూర్వీకులు కలలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.
ఇక పూర్వికులు ఎక్కువగా కలలో వస్తున్నట్లయితే వారి ఆత్మలను శాంతింప చేయడం కోసం కర్మలు చేయడం మంచిదని, అలాగే కొందరు కోరికలు తీరకుండా మరణిస్తారు. అలాంటి వారి తీరని కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చడం చాలా మంచిది. పూర్వీకులు ఆనందంతో ఉండి, నవ్వుతూ కనిపించారు అంటే వారు ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారని అర్థం. పూర్వీకులు ప్రశాంతంగా ఉన్నట్లుగా కనిపించినట్లయితే మీ గురించి సంతోషంగా ఉన్నారని అర్ధం. అంతేకాకుండా త్వరలో శుభవార్తలు వింటారని అర్ధం చేసుకోవచ్చు.
మీ పూర్వికులు చేతులు చాచినట్టుగా కలలో కనిపించినట్లయితే వారు మీకోసం ఏదైనా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు అని అర్థం. ఇక పూర్వికులు ఇంట్లో దక్షిణ మూలలో కనిపించినట్లయితే మీపై మీ విరోధులు దాడి చేయడానికి చూస్తూన్నారని అర్థం. కలలో పూర్వికులు మీ తల దగ్గర నిలబడి కనిపిస్తే త్వరలోనే మీ కష్టాలు తీరుతాయని అర్థం. వారు కాళ్ల దగ్గర కనిపించినట్లయితే ఏదైనా సమస్య త్వరలోనే మీకు వస్తుంది అని అర్థం చేసుకోవాలి.
Also Read: ఈ 3 పరిస్థితులు ఎదురైతే.. దురదృష్టానికి సంకేతమే..!