Ads
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పదకొండు మంది కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒకరు. ఆమె అసలు పేరు దనసరి అనసూయ. మాజీ నక్సలైట్ జీవితం మొదలు పెట్టిన సీతక్క మంత్రి దాకా సాగిన ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం..
ధనసరి అనసూయ 14 ఏళ్ళ వయసులో 1988 లో నక్సల్ పార్టీలో చేరారు. టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో ఆమెలోని పోరాట పటిమను గుర్తించిన నక్సల్స్ సభ్యులు ఉద్యమ వైపు నడిపించారు. ఫూలన్ దేవి రచనలతో ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ మరియు కులవాద వివక్ష పై ఆగ్రహించిన ఆమె ముందుగా విప్లవోద్యమం నడిచారు. ఆ దారిలోనే జనశక్తి పార్టీలో చేరారు. సంవత్సరాలు గుడుస్తున్నా ఆదివాసుల పైన, అణగారిన వర్గాల పైన జరగుతున్న దౌర్జన్యాలను తట్టుకోలేకపోయారు.
కొండలు, అడవులలో, గుట్టలలో మృత్యువు వెంటాడుతున్నా, నిద్రాహారాలు లేక అతి కఠోరమైన పోరాటం సాగిస్తూ ఆ ఉద్యమంలోనే సీతక్కగా ప్రయాణం సాగించారు. వివిధ హోదాల్లో పని చేస్తూ, సీతక్క కామ్రేడ్‌గా సుమారు 2 దశాబ్దాలు గడిపారు. నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలవమని ఎన్టీఆర్ పిలునిచ్చారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి గవర్నమెంట్ అవకాశాలను కల్పిస్తుందని, మీ రాక కోసం ఎదురుచూస్తుందని వెల్లడించారు. దీంతో చాలామంది పోరుబాట వదిలి పోలీసులకు లొంగిపోయారు.
సీతక్క దళ కమాండర్ నక్సల్ లీడర్ ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఆ టైమ్ లో సీతక్క తనకు తాను వెళ్ళి పోలీసులకు లొంగిపోయింది. అలా జనజీవన స్రవంతిలో ప్రవేశించారు. 2001లో ఎల్ఎల్బి లో చేరింది. చట్టం గురించి తెలుసుకున్న తర్వాత సీతక్కకు ప్రజా విధానం, పాలన పై ఇంట్రెస్ట్ కలిగింది. సామాజిక సేవలో సీతక్క చురుకుగా పాల్గొని, స్థానికంగా నాయకురాలిగా పేరుతెచ్చుకుంది. దాంతో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు సీతక్కకు టికెట్ ఇవ్వాలనుకున్నారు. అలా సీతక్క తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చారు. తొలిసారిగా 2004లో టీడీపీ తరుఫున పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య గెలిచారు.
2009 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య పై విజయం సాధించారు. అలా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 లో మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కానీ సీతక్క పై టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ గెలిచారు. ఎలెక్షన్స్ తరువాత సీతక్క టీడీపీని విడిచి, కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన అజ్మీరా చందులాల్ పై భారీ మెజారిటీతో గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ములుగు నుంచి గెలిచిన సీతక్క, మంత్రిగా ఎన్నికయ్యారు.
Ads
Also Read: BIG BREAKING : ఆస్పత్రిలో చేరిన కేసీఆర్… అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో..? అసలు ఏం జరిగిందంటే..?