56 ఏళ్ల వయసులో 23 ఏళ్ల అమ్మాయిని ఆ సీనియర్ హీరో రెండో పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటంటే.?

Ads

సీనియర్ నటుడు బబ్లు పృథ్వీరాజ్.. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి… క్రమంగా విల్లన్… ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమంగా అవకాశాలు తగ్గడంతో మెల్లిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసి ..మళ్లీ ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వి తన జీవితానికి సంబంధించి కొన్ని సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.

Ads

పృథ్వీ తనకంటే వయసులో ఎంతో చిన్నదైనా శీతల్ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ…డైవర్స్ తీసుకున్నప్పటికీ.. తన మొదటి భార్య బీనా విషయంలో పృథ్వీ కు ఇంకా బాధగానే ఉంటుందట. తనకు తన మొదటి భార్యకు మధ్య జరిగిన కొన్ని విషయాలను మొదటిసారి పృథ్వీ అందరితో పంచుకున్నాడు. బీనా, పృథ్వి మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. కానీ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు గొడవలు పెరగడమే కాకుండా ఇద్దరు ఎక్కువగా వాదించుకునే వారట.

దీనికి తోడు పృథ్వీ కొడుకుకి ఆటిజం ఉంది. పృథ్వీ దగ్గర ఉన్నప్పుడు ఆ అబ్బాయి కాస్త ఆనందంగా ఉంటాడట. అయితే భగవంతుడు తనకి అలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన…కొడుకు మీద దిగులు తో పృథ్వి ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. అయితే శీతల్ తన లైఫ్ లోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయిట. వయసుకు చిన్నది అయినా ఆమెకు మెచ్యూరిటీ చాలా ఎక్కువ…పైగా లైఫ్ పై ఫుల్ క్లారిటీ ఉంది. తన కొడుకుని కూడా శీతల్ ఎంతో బాగా చూసుకుంటుంది అని పృథ్వి అన్నాడు.

Previous articleఅప్పట్లో చిరంజీవి పరువు తీసిన ఈ సినిమా ఏంటో తెలుసా.? రెండు సార్లు సెన్సార్ అయ్యి.?
Next articleఅంతర్జాతీయ క్రికెట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నో బాల్ వేయ‌ని 8 మంది బౌల‌ర్స్ వీరే..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.