Ads
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి వంశానికి ఉన్న గౌరవం, క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీరామరావు అగ్రహీరోగా ఇండస్ట్రీని ఏలారు. ఆయన తరువాత నందమూరి వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
ఎన్టీఆర్‌కి నట వారసుడిగా బాలకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఈ కుటుంబం నుండి మూడో జనరేషన్ హీరోలు కూడా సినిమాల్లోకి వచ్చారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆ తరువాత బాలకృష్ణ ఎవరు బీట్ చేయలేని రికార్డ్ ను ఏలూరులో సృష్టించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటున్నారు. ఆయన కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మామూలుగా లేదు. అన్ స్టాపబుల్ షోతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఫ్యాన్స్ గా మలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఎన్టీరామారావు, బాలకృష్ణలు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఎవ్వరికీ, ఎప్పటికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
Ads
నందమూరి సినిమాలకు ఏలూరు అడ్డాగా పేరుగాంచింది. ఇటీవల రిలీజ్ అయిన భగవంత్ కేసరి ఏలూరులో డైరెక్ట్ గా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఎన్టీరామారావుకు ఏలూరులో యాబైకి పైగా అర్దశత దినోత్సవ సినిమాలు ఉన్నాయి. ఆయన తరువాత బాలకృష్ణకు కూడా 50కి పైగా అర్దశత దినోత్సవ సినిమాలు ఏలూరులో ఉండడం విశేషం. బాలకృష్ణ నరసింహనాయుడు మూవీ ఏలూరులోని అంబికా మినీ థియేటర్ లో 300కు పైగా రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది.
సమరసింహారెడ్డి మూవీ కూడా ఏలూరులోని సాయిబాలాజీ థియేటర్ లో 200 రోజులు ప్రదర్శించబడింది. ఎన్టీఆర్‌కు, బాలకృష్ణకు ఏలూరులో అనేక శత దినోత్సవ చిత్రాలు ఉన్నాయి. ఒకే వంశం నుంచి వచ్చిన రెండు తరాల హీరోల చిత్రాలు యాబైకి పైగా, నేరుగా 50 రోజులు ఒకే కేంద్రంలో ప్రదర్శించబడడం అనేది సాధారణ విషయం కాదు. వేరే వంశానికి చెందినవారు ఈ రికార్డుకి దరిదాపుల్లో లేరని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో అరుదైన రికార్డు ఎన్టీరామారావు, బాలకృష్ణల పేరున ఉండటం విశేషం.
Also Read: సూపర్ స్టార్ “రజనీకాంత్” వేళ్లు ఇలా ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఏంటంటే..?