హైదరబాద్ లో ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయో తెలుసా..?

Ads

సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అన్న గారు మనకి బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలని ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు పౌరాణిక పాత్రల తో అందరినీ మెప్పించేసారు. అలానే ఆయన నటన, డైలాగ్స్ అందరికీ నచ్చేస్తాయి. ఈ విషయంలో సందేహమే లేదు.

అంత గొప్ప నటుడు కనుకే ఇంత ఫ్యాన్ బేస్ వుంది. అన్న గారి గురించి నిజానికి ఏం చెప్పినా ఇంతా చెప్పినా అది తక్కువే. నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి కూడా.

సినిమాల్లో తర్వాత రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు బాగా దగ్గర అయిపోయారు ఎన్టీఆర్ గారు. అయితే ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఉన్నప్పుడే ఎక్కువ సంపాదించి ఉండొచ్చు. ఎన్టీఆర్ గారి ఆస్తుల గురించి చాలా మందికి సందేహం ఉండే ఉంటుంది. మీకూ ఉంటే ఈ కథనాన్ని చూసేయండి. హైదరాబాద్లోనే చాలా ఆస్తులు ఆయనకి ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఎన్టీఆర్ గారు ఏం సంపాదించారు ఆయన ఆస్తులు విలువ ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడే ఎక్కువగా సంపాదించారు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఇన్వెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అవి కోట్ల విలువ చేసే ఆస్తులుగా మారాయి.

Ads

#1. రామకృష్ణ థియేటర్:

ఎంతో ఇష్ట పడి ఎన్టీఆర్ గారు రామకృష్ణ థియేటర్ ని కట్టించుకున్నారు.

#2. ఎన్టీఆర్ ఎస్టేట్:

రామకృష్ణ థియేటర్ ని కొనేసాక ఆ పరిసర ప్రాంతాలను కూడా ఆయన కొనేసి ఎన్టీఆర్ ఎస్టేట్ గా పేరు పెట్టారు. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ కూడా ఈ ఎస్టేట్ లో వున్నాయి. ఎన్టీఆర్ జిల్లా లో ఓ థియేటర్ ని ఓపెన్ చేయాలనీ అనుకున్నారు కానీ అవ్వలేదు.

#3. తారక రామ థియేటర్:

ఈయన కాచిగూడ చౌరస్తాలోని తారక రామ థియేటర్ ని కూడా కట్టించుకున్న. అలానే మాసబ్ ట్యాంక్ లో ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ని ఐదు కట్టించి ఐదుగురి పిల్లలకి ఇచ్చేసారు. గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కూడా కొన్నారు. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో కూడా వుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఇల్లు వుంది. అది కూతురికి మొదట ఇచ్చారు తరవాత లక్ష్మీపార్వతి పేరున దాన్ని మార్చారు.

Previous articleHarom Hara Review : “సుధీర్ బాబు” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleMaharaja Review : మక్కల్ సెల్వన్ “విజయ్ సేతుపతి ” నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!