డంకీ స్టోరీ లీక్..! సలార్ కంటే ఇదే బాగుందిగా..?

Ads

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం డంకీ. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇప్పటికైనా సాంగ్స్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

అంతేకాకుండా సాంగ్స్ టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

shah rukh khan dunki movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇంతకీ ఆ కథ ఏంటి అన్న విషయానికి వస్తే.. పంజాబ్ లోని ఒక పల్లెటూరిలో నలుగురు స్నేహితులు నివసిస్తూ ఉంటారు. వారందరికీ ఇంగ్లాండ్ వెళ్లాలి అనే కోరిక ఉంటుంది. కానీ వాళ్లకు టికెట్ వీసా ఉండవు. ఇక టికెట్ వీసాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఆ నలుగురు స్నేహితులకు సహాయం చేయడం కోసం ఒక రక్షకుడు వారికి ఎదురుపడతాడు.

Ads

shah rukh khan dunki movie 1

అలా మొదలైన వారి ఇంగ్లాండ్ ప్రయాణం స్నేహం ప్రేమ పెళ్లి కుటుంబం సమస్యలు ఇలా ఏం జరుగుతుంది అన్నది అసలైన కథ. అక్రమంగా బార్డర్ లో జరిగే ప్రయాణాల్లో వాటి వల్ల వచ్చే సమస్యలు అవన్నీ కూడా ఫన్ తో కూడుకున్నవట. ఒకపక్క ఫన్ జనరేట్ అవుతూనే మరొకవైపు ఎమోషనల్ గా కూడా సాగుతుందట. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చివరి వరకు చాలా ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ సలార్ సినిమా స్టోరీ కూడా లీక్ అయ్యింది. ఈ రెండు సినిమాల స్టోరీ చూస్తే షారుఖ్ ఖాన్ సినిమా స్టోరీ బాగుంది అంటున్నారు.

venu swamy about prabhas

మరి సినిమా ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలి అంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే. దర్శకుడు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా సక్సెస్ అవడం ఖాయం అని తెలుస్తోంది. అయితే ఈ స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Previous article‘వార్ 2’ లో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న హీరోయిన్‌ ఎవరు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసా..?
Next articleఒకే ఒక్క కండీషన్ వల్ల తెలుగు స్టార్ హీరో సినిమా వదులుకుందా..? అదేంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.